Balakrishna: దటీజ్ బాలయ్య.. జగపతిబాబు కోసం వెంటనే ఒప్పేసుకున్నాడట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balakrishna as Chief guest to Rudrangi movie Pre Release event: నందమూరి బాలకృష్ణను సాయం కోరితే కాదంటారా? సమస్యే లేదు, అది తన పరిధిలోని విషయం కాకపోయినా ఎలాగోలా దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తారు. తాజాగా ఇప్పుడు జగపతి బాబు కోసం ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూ సిద్దమయ్యారు ఆయన. రేపు బాలయ్య చీఫ్ గెస్ట్ గా రుద్రంగి ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుంది, జగపతిబాబు బాలయ్యను ఆహ్వానించడంతో వెంటనే ఒప్పుకున్న బాలయ్య తాను వస్తానని మాట ఇచ్చాడట. జగపతిబాబు, విమలా రామన్, మమతా మోహన్ దాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ‘రుద్రంగి’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై మంచి బజ్‌నే క్రియేట్ చేయగా ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహిస్తున్నారు.
Movies Releasing This Week: నిఖిల్ ‘స్పై’తో పాటు ఐదు సినిమాలు.. రెండు రీ రిలీజులు!
Also Read
- 72nd National Film Awards: ఉత్తమ నటుడు కిరీటం వీళ్లిద్దరికీ.. జాతీయ ఉత్తమ నటిగా!
- Committee Kurrollu: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’కు అరుదైన గౌరవం
- Kiran Abbavaram: ‘చెన్నై లవ్ స్టోరీ’పై కిరణ్ ధీమా.. నా కొడుకు అలా పిలిస్తే చాలు అంటూ కామెంట్స్!
- Kiran Abbavaram: "మా అమ్మ ఆరు ఏళ్లు నాకు దూరంగా ఉంది" కిరణ్ అబ్బవరం ఎమోషనల్..
తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. భీమ్ రావు అనే దొర పాత్రలో జగపతిబాబు కనిపించ బోతుండగా అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాను బీఆర్ఎస్ నేత రసమయి బాలకిషన్ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. కాలకేయ ప్రభాకర్, ఆశిష్ గాంధీ, ఆశిష్ నందా, దివి వైద్య ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా జులై 7న థియేటర్లలో విడుదల కానుంది. ఇక దాదాపు పుష్కర కాలం తర్వాత మళ్లీ ఈ సినిమాతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తుంది మమతా మోహన్‌దాస్. నటిగా, గాయనిగా టాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న మమతా క్యాన్సర్ బారిన పడిన తరువాత టాలీవుడ్‌లో సినిమాలు చేయట్లేదు. కాగా మళ్లీ ఇన్నేళ్లకు ‘రుద్రంగి’ అనే పీరియాడిక్ యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తాజావార్తలు
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!