Jagadish Reddy : విచారణ కమిషన్ పారదర్శకంగా విచారణ చేయటం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్యుత్ విచారణ కమిషన్‌పై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇవాళ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. విచారణ కమిషన్ కేసిఆర్ పైన అనవసర ఆరోపణలు చేస్తుందన్నారు. విచారణ కమిషన్ పారదర్శకంగా విచారణ చేయటం లేదని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత బీ ఆర్ ఎస్ పైన బురద జల్లె ప్రయత్నం చేస్తోందని, కేసీఆర్ పైన, గత ప్రభుత్వం పైన చేసిన అభివృద్ది పై ఆరోపణలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. విద్యుత్ కొనుగోళ్ల పై ఉన్న విచారణ చేయిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాధనం దుర్వినియోగం జరగలేదు, ఒప్పందాల మేరకే ప్రాజెక్టులు జరిగాయని కేసిఆర్ లేఖ రూపం లో చెప్పారని, ఇందులో అవినీతి జరిగింది, కోట్ల రూపాయలు కూడబెట్టారు అంటూ ఆరోపిస్తున్నారన్నారు. నియమాలకు విరుద్ధంగా కమిషన్ వ్యవహరిస్తుందని జగదీష్ రెడ్డి అన్నారు. కమిషన్ న్యాయ బద్దంగా విచారణ చేయాలని, ఎలాంటి ఒత్తిడి లేకుండా వివక్ష లేకుండా పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. నల్లగొండ లో ప్రోజెక్ట్ ఎందుకు పెట్టారు అని కొంత మంది ప్రశ్నిస్తున్నారని, నల్లగొండ లో యాదాద్రి ప్రోజెక్ట్ ను వ్యతిరేకించే వారిని చెప్పుతో కొడుతామన్నారు.
Also Read
- Astrology: మే 25th సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త
- Petrol, Diesel Price Hike: మళ్ళీ భారీగా పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలు
- PBKS: ఒక్క మ్యాచ్‌తో ముగ్గురి కథ క్లోజ్.. పాపం సర్పంచ్ సాబ్ ఆశలను ముంచేసిన 'వాంఖేడే' పోరు..
- Virat Kohli: ఈ గడ్డం ఏంటి బాబోయ్.. గిల్ కొత్త లుక్‌పై కోహ్లీ సెటైర్లు.. వీడియో వైరల్
నల్లగొండ అభివృద్ది చెందకూడదా? అని ఆయన ప్రశ్నించారు. ఉద్యమం లో ముందుంది నల్లగొండ జిల్లా అని ఆయన వ్యాఖ్యానించారు. ఫ్లోరోసిస్ ను తరిమింది కేసీఆర్ అని ఆయన అన్నారు. కోదండరామ్ కి నల్లగొండ అభివృద్ది చెండకూడదు అని ఉందా? అని ఆయన ప్రశ్నించారు. కోదండరామ్ కు వందశాతం అవగాహన లేదని ఆయన అన్నారు. ఏదో చిన్న పదవి కోసం ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నాడని, ఒక ఎమ్మెల్సీ కోసం ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడన్నారు. అనవసర ఆరోపణలు చేయటం మంచిది కాదు కోదండరామ్ కు అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Peddi: చరణ్ ‘పెద్ది’ సాంగ్‌కు రికార్డ్ వ్యూస్..
-
Astrology: మే 25th సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త
-
Tollywood Percentage War: మెగాస్టార్ వద్దకు ఎగ్జిబిటర్ల పంచాయితీ?
-
Single Screen vs Multiplex: టాలీవుడ్లో పర్సంటేజ్ షేర్ ఎలా ఉంటుందంటే ?
-
Petrol, Diesel Price Hike: మళ్ళీ భారీగా పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలు
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!