NTV Telugu Site icon

Jagadish Reddy : కారణం, వారెంట్ లేకుండా సోదాలు ఎలా చేస్తారు..

Jagadish Reddy

Jagadish Reddy

జన్వాడ ఫార్మ్ హౌస్, కేటీఆర్‌ ఇంట్లో పోలీసులు సోదాలు చేయడం పై మాజీమంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లడుతూ.. KTR ఇంటి పై దౌర్జన్యంగా దాడి చేయడం ఖండిస్తున్నామన్నారు. కారణం, వారెంట్ లేకుండా సోదాలు ఎలా చేస్తారని, ప్రతిపక్ష పార్టీ నేత ఇంటిపై పోలీసులు దుర్మార్ఘంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఎక్కడ ఎదో జరిగితే అది KTR కి ఎం సంబంధమని జగదీష్‌ రెడ్డి ఫైర్‌ అయ్యారు. రేవంత్ సోదరులపై చాలా ఆరోపణలు వస్తున్నాయని, రేవంత్ సోదరుల ఇళ్ళ పై పోలీసులకు ఇలాగే చేసే దమ్ముందా అని ఆయన ప్రశ్నించారు. స్వయంగా పోలీసులే రేవంత్ తమ్ముడితో సెటిల్ చేసుకోమ్మని బాధితులకు చెబుతున్నారని, కాంగ్రెస్ , బీజేపీ కలిసి ఆడుతున్న నాటకమన్నారు జగదీష్‌ రెడ్డి. పై నుండి మోడీ , ఆదానీలే రేవంత్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని, నిజామ్ కాలంలో కూడా ఇంతలా దుర్మార్ఘంగా పనిచేయలేదన్నారు జగదీష్‌ రెడ్డి. చిల్లర దాడులు మమ్మల్ని భయపెట్టలేవు.. మాకు అరెస్టులు కొత్త కాదని ఆయన వ్యాఖ్యానించారు.

Israel Iran: ఇరాన్ ఆయువుపట్టుపై దెబ్బకొట్టిన ఇజ్రాయిల్..

అంతేకాకుండా..’FIR, సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు ఎలా చేస్తారు. ప్రభుత్వ వైఫల్యాలతో ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చేందుకే ఇలాంటి దాడులు. ప్రతిపక్ష నేతగా ప్రజల్లో KTR కి వస్తున్న ఆదరణ తట్టుకోలేకే దాడులు. వరదల సందర్బంగా భౌతిక దాడులు చేస్తేనే ఎం కాలేదని ఇప్పుడు పోలీసులను వాడుతున్నారు. ప్రజా గొంతుకైన KTR కి సమాధానం చెప్పలేక చిల్లర వేషాలు. పొంగులేటి ఇంట్లో విదేశీ వాచీల వ్యవహారం ఎటుపోయింది. మంత్రుల ఇళ్ళల్లో సోదా చేస్తే మీరనుకున్నయి దొరుకుతాయి. ఎన్ని కుట్రలు చేసినా మా ప్రజాపోరాటం ఆగదు. ప్రజలే KTR ని రక్షించుకుంటారు. సెక్యూరిటీ లేకుండా వస్తే KTR, రేవంత్ చేరిష్మా తెలుస్తుంది. తెలంగాణలో గృహ ప్రవేశానికి దావత్ లు జరగడం సర్వ సాధారణం. మంత్రులే పట్టపగలు తాగి తిరుగుతున్నారు వారికి పరీక్షలు చేస్తారా.. లేనివి ఉన్నట్టు సృష్టించి కేసులు బనాయించాలని చూస్తున్నారు. మీరు ఎంత దుర్మార్గానికి దిగజారినా.. KTR ఇమేజ్ పెరుగుతుంది తప్ప తగ్గదు.. కార్పొరేట్లకు దోచే కుట్రను దారిమరల్చేందుకే ఇదంతా.. చట్ట పరిధిలో పనిచేయకపోతే డీజీపీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. తప్పకుండా తగిన మూల్యం తప్పదు.. కాంగ్రెస్ చెప్పినట్లు కాకుండా పోలీసులంతా చట్ట పరిధిలో పనిచేయండి.. రౌడీల్లాగా చట్టవిరుద్దంగా పోలీసులు వస్తున్నారు.. అనుమతి లేకుండా రావడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.. వెంటనే సోదాలు అపి పోలీసులు వెనక్కి రావాలి.. దాడులు ఇలానే కొనసాగితే పోలీసుల పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం..’ అని జగదీష్‌ రెడ్డి అన్నారు.

IND vs NZ: ఏం పట్టింది భయ్యా.. గాల్లోకి డైవ్ చేసి మరీ (వీడియో)

Show comments