ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో రాజకీయ నిరుద్యోగుల మార్చ్ లు, సభలు ర్యాలీల హడావిడి కొనసాగుతుందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. ఇవాళ ఆయన సూర్యాపేట జిల్లాలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రభుత్వ ఖాళీలను ఎక్కువగా భర్తీ చేశామన్నారు. నిరుద్యోగ సమస్య పెరిగిపోవడానికి గత ప్రభుత్వలతోపాటు.. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ప్రభుత్వమే కారణమని ఆయన ఆరోపించారు. లీకేజీల మీద మాట్లాడిన దొంగను పట్టుకున్న తర్వాత రూట్ మార్చి నిరుద్యోగ సమస్యను లేవనెత్తుతున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ దిక్కు దివానా లేని పార్టీ అని ఆయన అన్నారు.
Also Read : Perfumes : మగవారు ఆ టైమ్‌లో ఈ పెర్ఫ్యూమ్స్ వాడితే.. ఆడవారికి చాలా ఇష్టమట..
అంతేకాకుండా.. తప్పుల తక్కడలా తయారైంది కాంగ్రెస్ పార్టీ అని, మార్చ్ లు, ర్యాలీలు చేస్తున్న రాజకీయ నిరుద్యోగులకు 2023 ఎన్నికల తరువాత ఏప్రిల్ ఫస్ట్ అవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణా లో ఉన్నదే నాలుగు ఈకలని, ఆ నాలుగు ఈకలు కూడా ఎవరిగోల… వాళ్లదే అంటూ మంత్రి జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. బీజేపీ ఆడుతున్న క్షుద్ర రాజకీయాలలో లీకేజీలు ఒక భాగంగా మారిందని మండిపడ్డారు జగదీష్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ పార్టీకి కాంగ్రెస్ బీ-టీం గా పనిచేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. నిరుద్యోగ మార్చ్ చేయాల్సి వస్తే అది ఢిల్లీలో చేయాలని ఆయన హితవు పలికారు. ఏటా 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోడీకి వ్యతిరేకంగా దీక్ష చేయాలని, ఏటా రెండు కోట్లు కాదు కదా సంవత్సరానికి 2 లక్షల మంది ఉద్యోగాలు పోతున్నాయని విమర్శించారు మంత్రి జగదీష్ రెడ్డి.
Also Read : ప్రపంచంలోని 10 అత్యంత అద్భుతమైన సహజ రాతి నిర్మాణాలు