Site icon NTV Telugu

Jagadish Reddy : బీజేపీ దుర్మార్గాలకు పరాకాష్ట ఆప్ నేత సిసోడియా అరెస్ట్

Jagadish Reddy On Modi

Jagadish Reddy On Modi

ఢిల్లీ ఉప ముఖ్య‌మంత్రి మ‌నీశ్ సిసోడియా అరెస్టుపై ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ కూడా బీజేపీపై విమర్శ‌లు కురిపిస్తున్నారు. బీజేపీ దుర్మార్గాలకు పరాకాష్ట ఆప్ నేత సిసోడియా అరెస్ట్ అని ఆరోపించారు మంత్రి జగదీష్‌ రెడ్డి. సూర్యాపేట జిల్లాలో సోమవారం మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై ఫైర్‌అయ్యారు. ఈ.డీ, ఐ.టీ, సీబీఐ వంటి సంస్థలు తమ స్వాతంత్ర్యాన్ని కోల్పోయాయని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read : Delhi Liquor Scam Case: సిసోడియా తరహాలోనే కవిత అరెస్ట్..! మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

బీజేపీ నేతలు చేసిన ఆరోపణల కోసం మాత్రమే కేంద్ర నిఘా సంస్థలు పని చేస్తున్నాయన్నారు. ఎమర్జెన్సీకి మించిన దారుణమైన పరిస్థితులు దేశంలో వున్నాయని ఆయన విమర్శించారు. బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు అప్రజాస్వామికమన్నారు.

Also Read : Zelensky: వ్లాదిమిర్ పుతిన్ తన దగ్గర వాళ్లతోనే చంపబడతాడు.. జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు

బీజేపీ అరాచకాలు ఇలానే కొనసాగితే దేశ ప్రజల నుండి తిరుగుబాటు తప్పదని మంత్రి జగదీష్‌ హెచ్చరించారు. అణచివేతల ద్వారా చరిత్రలో ఏ ప్రభుత్వాలు మనుగడ సాధించలేదని ఆయన అన్నారు. బీజేపీకి బుద్ది చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఆయన అన్నారు. ఢిల్లీ మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, తెలంగాణ సీఎం కుమార్తె ఎమ్మెల్సీ కవిత, ఏపీకి చెందిన వైఎస్సార్సీపీ ఎంపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిలతో పాటు ప‌లువురికి సంబంధం ఉన్నట్టు ఈడీ పేర్కొంది. ఇప్ప‌టికే మ‌ద్యం స్కాంలో కొంత మందిని సీబీఐ అరెస్ట్ చేసింది. తాజాగా సిసోడియా అరెస్ట్ త‌ర్వాత సీబీఐ, ఈడీ మరికొందరిని అరెస్ట్‌ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Exit mobile version