స్పైస్ జెట్ విమానానికి ప్రమాదం తప్పింది. గాలిలో ఉండగా క్యాబిన్ లోకి పొగలు వ్యాపించడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు పైలెట్లు. ఢిల్లీ నుంచి మధ్య ప్రదేశ్ జబల్ పూర్ కు వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో అకాస్మత్తుగా పొగలు వచ్చాయి. క్యాబిన్ మొత్తం పొగతో నిండిపోయింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. పొగ కారణంగా ప్రయాణికులు ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. శనివారం ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరిన విమానం 5000 అడుగుల ఎత్తులోకి చేరుకోగానే…