Cheapest Phone: కిందపడినా పగలని ఫోన్.. కేవలం రూ.1499లకే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐటెల్ కంపెనీ భారత మార్కెట్లో ‘ఐటెల్ టఫ్’ పేరుతో కొత్త రగ్గడ్ ఫీచర్ ఫోన్‌ను అత్యంత తక్కువ ధరకు విడుదల చేసింది. ఈ ఫోన్ ధరను రూ. 1,499గా నిర్ణయించారు. నిత్యం ఫోన్ కింద పడిపోవడం, దుమ్ము లేదా నీటిలో పాడైపోతుందనే భయం లేకుండా వాడాలనుకునే వారికి ఇది ఒక సరైన ఎంపిక. ముఖ్యంగా పొలాలు, నిర్మాణ రంగాలు లేదా కఠినమైన పరిస్థితుల్లో పనిచేసే వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని “రియల్ భారత్ కా టఫ్ ఫోన్” అనే నినాదంతో కంపెనీ దీనిని రూపొందించింది.
ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని మన్నిక. ఇది 2 మీటర్ల ఎత్తు నుంచి కింద పడినా తట్టుకునేలా యాంటీ-ఫాల్ డ్రాప్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. అలాగే దీనికి ఉన్న IP54 రేటింగ్ వల్ల దుమ్ము, వర్షం లేదా నీటి చినుకుల నుంచి ఫోన్‌కు తగిన రక్షణ లభిస్తుంది. యూజర్లకు అదనపు భద్రత కల్పించడం కోసం కంపెనీ ఈ ఫోన్‌తో పాటు ఉచితంగా షాక్-ప్రూఫ్ సిలికాన్ కేస్‌ను కూడా అందిస్తోంది. దీనివల్ల వినియోగదారులు కవర్ కోసం వేరే డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.
Also Read
- PMO Fake ID Case: ప్రధాని భద్రతలో కలకలం.. ఫేక్ PMO ఐడీ కేసులో ట్విస్ట్..
- Redmi Smart Phone: 1.5K AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీ.. రెడ్ మీ నుంచి అదిరిపోయే స్మార్ట్ ఫోన్..
- Minister Satya Kumar: కొత్త పార్టీ పెట్టుకో.. కానీ ముందు ప్రజలకు ఆ లెక్క చెప్పు..
- Mallikarjun Kharge: ఫలించిన కాంగ్రెస్ పోరాటం.. ఖర్గే ర్యాలీ తర్వాత శుద్ధి చేసిన ఘటనపై ఎఫ్ఐఆర్
రైతుల కోసం ప్రత్యేకంగా ఇందులో ‘అగ్రి బటన్’ అనే విశిష్ట ఫీచర్‌ను ఇచ్చారు. ఈ ఒక్క బటన్‌ను ప్రెస్ చేయడం ద్వారా ప్రభుత్వ వ్యవసాయ హెల్ప్‌లైన్‌ను నేరుగా సంప్రదించి, పంటలకు సంబంధించిన సమాచారం లేదా సలహాలను ఉచితంగా పొందవచ్చు. చీకటి సమయంలో ఉపయోగపడేలా ఇందులో సాధారణ ఫోన్ల కంటే ఎక్కువ వెలుతురునిచ్చే ‘డ్యూయల్-లాంప్ టార్చ్’ అమర్చారు. రాత్రిపూట పొలాల్లో పనిచేసే వారికి, విద్యుత్ లేని సమయంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
సౌండ్ స్పష్టంగా ఉండటానికి సూపర్ సౌండ్‌బాక్స్, ఫోన్ వాడకాన్ని సులభతరం చేయడానికి ‘కింగ్ వాయిస్’ వంటి సదుపాయాలు ఉన్నాయి. సాధారణంగా ఫీచర్ ఫోన్లలో పాత మోడల్ మైక్రో-యూఎస్బీ చార్జర్లు ఉంటాయి, కానీ ఐటెల్ టఫ్ ఫోన్లో ఆధునిక యూఎస్బీ టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌ను అందించడం ద్వారా వినియోగదారుల చార్జింగ్ సమస్యను సులభతరం చేశారు. తక్కువ బడ్జెట్లో ఎక్కువ మన్నిక, ఉపయోగకరమైన ఫీచర్లు కోరుకునే వారికి ఈ ఫోన్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
తాజావార్తలు
-
Cheapest Phone: కిందపడినా పగలని ఫోన్.. కేవలం రూ.1499లకే..
-
AVD తర్వాత మరో మల్టీప్లెక్స్.. నార్త్ హైదరాబాద్‌పై రౌడీ హీరో కన్ను!
-
PMO Fake ID Case: ప్రధాని భద్రతలో కలకలం.. ఫేక్ PMO ఐడీ కేసులో ట్విస్ట్..
-
Redmi Smart Phone: 1.5K AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీ.. రెడ్ మీ నుంచి అదిరిపోయే స్మార్ట్ ఫోన్..
-
Pan India Star: పాన్ ఇండియా కూడా పాతదైపోయిందా? హీరోలకు నెక్ట్స్ ట్యాగ్ ఏంటి?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!