NTV Telugu Site icon

Itel A50: అదిరిపోయే ఫీచర్స్ ఉన్న ఆండ్రాయిడ్ మొబైల్ కేవలం రూ. 6099కే

Itela50

Itela50

Itel A50: మీరు తక్కువ ధరలో అత్యుత్తమ పనితీరు కలిగిన ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, itel A50 మీకు సరైన ఎంపిక కావచ్చు. అమెజాన్ నిర్వహిస్తున్న “ఐటెల్ డేస్” సేల్‌లో ఈ ఫోన్‌ను ప్రత్యేక ఆఫర్‌లతో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ 3 GB RAM (మెమొరీ ఫ్యూజన్ ఫీచర్‌తో 8 GB వరకు పెంచుకోవచ్చు) ఇంకా 64 GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ ధర కేవలం రూ.6,099 కే అందించనున్నారు. జనవరి 2 వరకు కొనసాగనున్న ఈ సేల్‌లో రూ.250 ఫ్లాట్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి EMI లావాదేవీలు చేసే వినియోగదారులకు ప్రత్యేక తగ్గింపు కూడా ఉంది. అలాగే ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా పాత ఫోన్‌ను మార్పిడి చేసి అదనపు తగ్గింపును పొందవచ్చు. ఈ తగ్గింపు మీ పాత ఫోన్, బ్రాండ్, కంపెనీ మార్పిడి పాలసీ ఆధారంగా ఉంటుంది. అందుబాటులో ఉన్న సేల్ ఆఫర్లను వినియోగించుకుని, తక్కువ ధరలో గొప్ప పనితీరును పొందండి.

Also Read: Athiya Shetty: బేబీ బంప్‌‭తో దర్శనమిచ్చిన అతియా శెట్టి

ఇక Itel A50 సంబంధించి పూర్తి వివరాలను ఒకసారి చూస్తే.. ప్రధాన ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 6.6 ఇంచ్ IPS LCD డిస్‌ప్లే, 720 x 1612 పిక్సెల్ రిజల్యూషన్‌తో డిస్‌ప్లే వస్తుంది. అలాగే Unisoc T603 చిప్‌సెట్, ఆక్టా-కోర్ CPUతో ప్రాసెసర్ లభిస్తుంది. 3 GB RAM (మెమొరీ ఫ్యూజన్ ఫీచర్‌తో 8 GB వరకు విస్తరించవచ్చు), 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో రియర్ కెమెరాగా 8 MP ప్రైమరీ కెమెరా, ఫ్రంట్ కెమెరాలో 5 MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇక బ్యాటరీ 5000 mAh తో వస్తుండగా, 10W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. Android 14 (Go ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టమ్, 4G LTE సపోర్ట్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, యాక్సిలరోమీటర్ సెన్సార్లు ఉండనున్నాయి. ఇక ఫోన్ మిస్ట్ బ్లాక్, లైమ్ గ్రీన్, సయాన్ బ్లూ, షిమ్మర్ గోల్డ్ అనే 3 రంగులలో అందుబాటులో ఉన్నాయి.

Also Read: Digital Arrest Call: సైబర్ నేరస్తుడికి యువకుడు బలే దెబ్బేశాడుగా.. (వీడియో)

Show comments