Home Remedies for Itchy Eyes: కళ్లలో ‘దురద’ రావడం సాధారణ విషయం. కళ్ల దురదకు చాలా కారణాలు ఉన్నాయి. కాలుష్యం, దుమ్ము, పొగ మరియు ఇన్ఫెక్షన్ వంటి పలు కారణాల వల్ల కళ్లలో దురదగా ఉంటుంది. దాంతో మనం చికాకుకు గురవుతుంటాం. చేస్తున్న పనిపై ఇంట్రెస్ట్ పోతుంది. మీకు పదేపదే దురద వేస్తే.. కళ్లకు ప్రమాదం మరింత పెరుగుతుంది. ఈ పరిస్థితిలో మీరు కొన్ని ప్రత్యేకమైన ఇంటి నివారణలను (హోం రెమెడీస్) అనుసరిస్తే ఆ సమస్యకు ఇట్టే చెక్ పెట్టొచ్చు. ఈ హోం రెమెడీస్ మన అమ్మమ్మల కాలం నుంచి ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
శుభ్రమైన నీటితో కడగాలి:
కళ్లలో దురదగా ఉంటే అసలు భయపడవద్దు. శుభ్రమైన మరియు చల్లటి నీటిని కళ్లపై చల్లుకోండి. నీటిని కళ్లపై సుతిమెత్తగా రాయొచ్చు కూడా. ఇలా చేయడం వల్ల కంటి చికాకు నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. తద్వారా మీరు పదేపదే దురదకు గురవకుండా ఉంటారు.
పాలు:
కళ్లలో దురద సమస్య ఉన్నప్పుడు పాలు కూడా ఉపయోగించవచ్చు. పాలుకళ్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దూది సహాయంతో కళ్లలో చల్లని పాల చుక్కలను వేయండి. ఇలా చేయడం వల్ల మంట తగ్గిపోతుంది.
రోజ్ వాటర్:
కెమికల్ ఫ్రీ రోజ్ వాటర్ కళ్లకు బాగా పనిచేస్తుంది. కాటన్ సహాయంతో రోజ్ వాటర్‌ను కళ్లలో పట్టించి.. కొంత సమయం తర్వాత శుభ్రమైన నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల దురద వేయదు.
Also Read: WI vs IND 3rd T20: నేడు వెస్టిండీస్‌తో మూడో టీ20.. ఓడితే అంతే ఇక! 2016 తర్వాత
అలోవెరా జెల్:
సాధారణంగా చర్మ సౌందర్యాన్ని పెంపొందించడానికి అలోవెరా జెల్‌ని వాడుతాం. అయితే ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కళ్ల దురదను కూడా దూరం చేస్తుంది. కలబంద జెల్‌ను కాటన్ సహాయంతో కళ్ల చుట్టూ అప్లై చేయాలి. కొంత సమయం తర్వాత శుభ్రమైన నీటితో కడిగితే మంచి ఉపశమనం ఉంటుంది.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. వీటిని అనుసరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ntvtelugu.com దానిని ధృవీకరించలేదు.)