IT Raids: శ్రీ చైతన్య విద్యా సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు మూడో రోజుకు తనిఖీలు కొనసాగిస్తున్నారు. విద్యా సంస్థల అధినేత బొప్పన సత్యనారాయణ రావు, ఆయన కుటుంబసభ్యుల నివాసాల్లో ఐటీ అధికారుల సోదాలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా ఆయన కుమార్తెలైన బొప్పన సుష్మ, బొప్పన సీమ ఇళ్లలో కూడా ప్రత్యేక దర్యాప్తు జరుగుతోంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 32, రోడ్ నెంబర్ 10లో ఉన్న బొప్పన సుష్మ, బొప్పన సీమ నివాసాల్లో ఐటీ అధికారులు నిన్నటి నుంచి మరింత తీవ్రంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అక్రమ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కీలక ఆధారాలను సేకరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
Read Also: Pranay Amrutha: ఇన్నాళ్ల నిరీక్షణ తర్వాత న్యాయం జరిగింది.. అమృత ఎమోషనల్ పోస్ట్
ఇది ఇలా ఉండగా, సోదాల సమయంలో ఇద్దరు డైరెక్టర్లు అందుబాటులో లేకపోవడం గమనార్హం. వారిరివురు వచ్చిన తర్వాత ఐటీ శాఖ మరోసారి వారి నివాసాల్లో తనిఖీలు నిర్వహించే అవకాశముందని సమాచారం. విద్యా సంస్థల ద్వారా ఆదాయపు పన్ను మోసం చేసి, ఆ నిధులను మరొకచోటికి మళ్లించారని అనుమానం నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వారి ఆస్తులపై మరిన్ని దర్యాప్తులు కొనసాగనున్నట్లు తెలుస్తోంది.
Read Also: RC 16 : బూత్ బంగ్లాలో చరణ్ – బుచ్చిబాబు షూటింగ్
విద్యా రంగంలో పేరొందిన సంస్థపై ఈ స్థాయిలో ఐటీ దాడులు జరగడం గమనార్హం. అధిక మొత్తంలో ఆదాయపు పన్ను ఎగవేశారని, ఆ నిధులను ఇతరత్రా మార్గాల్లో మళ్లించారని అనుమానంతో అధికారులు జాగ్రత్తగా అన్ని లావాదేవీలను పరిశీలిస్తున్నారు. సోదాల అనంతరం పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.