NTV Telugu Site icon

Raghunandan Rao: పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబంలో వారందరూ పోటీ చేయాలి..

Raghunandan Rao

Raghunandan Rao

బీజేపీ ఉన్నదా ? లేదా ? అన్నది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చూపెడతామని అన్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబంలో KCR, KTR, కవిత, హరీష్, సంతోష్ ఈ ఐదుగురు పోటీ చేయాలని సవాల్ చేశారు. కాగా.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు బీజేపీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. బీఆర్ఎస్ గత పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్లను అమ్ముకున్నారని దుయ్యబట్టారు. హరీష్ రావు రాజకీయాల్లోకి రాకముందే మెదక్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ గెలిచిందని రఘునందన్ తెలిపారు. సూట్ కేసులు ఇచ్చే వాళ్లకు టికెట్లను బీఆర్ఎస్ నాయకులు అమ్ముకుంటారని ఆరోపించారు.

Read Also: Mars: అంగారకుడి భూమధ్య రేఖ కింద “వాటర్ ఐస్”

ఎర్రోళ్ల శ్రీనివాస్ లాంటి వాళ్లకు టికెట్లు ఇవ్వరు.. కానీ, కోళ్లు అమ్ముకునేటోల్లకు.. మందు గోలీలు తయారు చేసేటోల్లకు.. బస్సులు నడిపేటోల్లకు టికెట్.. ఇచ్చింది వాస్తవం కాదా ? అని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే.. బీజేపీయేతర ముఖ్యమంత్రులు ప్రధానిని కలిసి నిధులు తెచ్చుకున్నారు.. ప్రధాని మోడీ ముందు ముఖం చెల్లక అప్పటి సీఎం కేసీఆర్ కలువలేదని మండిపడ్డారు. కాగా.. బీఆర్ఎస్ పేరు మార్చుకున్నప్పుడే తెలంగాణతో పేగు బంధం తెగిపోయిందని అన్నారు. బీఆర్ఎస్కు ఓటు వేస్తే హుస్సేన్ సాగర్లో వేసినట్టేనని తెలిపారు. త్వరలో పులి బయటకు వస్తాడని కేటీఆర్ అన్నారు.. బయటకు వచ్చేది పులి కాదు, కలుగులోకి వెళ్లాల్సిన ఎలుక అది అని విమర్శించారు.

Read Also: Sania Mirza Father: సానియా మీర్జా మాలిక్కు ఖులా ఇచ్చింది..

కాగా.. కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రాజెక్ట్ లు అప్పగించడంతో నష్టం జరుగుతుందని హరీష్ రావు అంటున్నారు.. 2016లో కేంద్ర జలవనరుల మంత్రి సమక్షంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కృష్ణా జలాలపై ఒప్పందాలు చేసుకున్నారని రఘునందన్ తెలిపారు. 299 టీఎంసీలు చాలు అని సంతకం పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం అని తెలిపారు.

Show comments