Chandrayaan-3: చంద్రుడిపై మరోసారి ‘సూరీడు’.. అప్డేట్ల కోసం ఇస్రో వెయింటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చంద్రయాన్-3 మిషన్‌కు రేపు ముఖ్యమైన రోజు.. చంద్రునిపై 14 రోజుల రాత్రి రేపటితో ముగియనుంది. చంద్రయాన్-3 మిషన్‌లోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ స్లీప్ మోడ్ నుండి బయటకు రాబోతున్నాయి. 16 రోజుల పాటు స్లీప్ మోడ్‌లో ఉన్న తర్వాత.. ల్యాండర్, రోవర్‌లను ఇస్రో శుక్రవారం (సెప్టెంబర్ 22) యాక్టివేట్ చేయనుంది. అదృష్టం ఉంటే అదే జరుగుతుందని.. రేపు ల్యాండర్, రోవర్ రెండింటినీ యాక్టివేట్ చేసేందుకు ప్రయత్నిస్తామని ఇస్రో తెలిపింది. దీంతో చంద్రుని ఉపరితలాన్ని మరింత పరిశోధించడానికి ఉపయోగపడే మరికొన్ని ప్రయోగాత్మక డేటాను తాము పొందుతామని పేర్కొంది.
Karnataka: మణికట్టు కోసుకున్న 14 మంది విద్యార్థినులు.. అధికారులకు అంతుచిక్కని ఉదంతం..
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
సూర్యుడి కిరణాలకు విక్రమ్ ల్యాండర్, రోవర్‌లో అమర్చిన బ్యాటరీలు రీఛార్జ్ కావాల్సి ఉంటుంది. పగటి సమయం మొదలు కాబోతోన్నందున సూర్యుడి వెలుగును గ్రహించి బ్యాటరీలు మళ్లీ రీఛార్జ్ అవుతాయని ఇస్రో ఆశిస్తోంది. అదే జరిగితే ఇంకో 14 రోజుల పాటు చంద్రుడిపై పరిశోధనలు సాగించడానికి వీలు ఉంటుందని ఇస్రో పేర్కొంది. మరోవైపు ల్యాండర్, రోవర్‌లను రీయాక్టివేట్ చేసేందుకు ఇస్రో సన్నద్ధమవుతోంది. ఇప్పటికే రోవర్ చంద్రుడి ఉపరితలంపై సుమారు 200 మీటర్ల దూరం ప్రయాణించి కీలక సమాచారాన్ని భూమికి పంపింది. దక్షిణ ధృవం చీకటితో నిండిపోయే సమయం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ముందు జాగ్రత్తగా సెప్టెంబర్ 2న రోవర్‌ను, 4న ల్యాండర్‌ను స్లీపింగ్ మోడ్‌లోకి పంపించారు. దక్షిణ ధృవంపై ఉష్ణోగ్రత చాలా చల్లగా ఉంటుంది. మైనస్ 180 నుంచి మైనస్ 230 డిగ్రీలు ఉంటుంది. అయితే ఇంత తీవ్రమైన చలిని ప్రజ్ఞాన్ రోవర్ తట్టుకుని తిరిగి పని చేయగలదా లేదా అనేది తెలియాల్సి ఉంది. అంతేకాకుండా.. చంద్రుడిపై సూర్య కాంతి వస్తుండడంతో చంద్రయాన్-3 వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో చూడాల్సి ఉందని ఇస్రో చైర్మన్ సోమ్ నాథ్ తెలిపారు. ఇప్పుడు చంద్రుడిపై సూర్యోదయం అయింది కాబట్టి, చంద్రయాన్-3 వ్యవస్థల్లో కదలిక వస్తే అవి శీతల వాతావరణాన్ని తట్టుకుని నిలబడినట్టు భావిస్తామని సోమ్ నాథ్ తెలిపారు.
Top Headlines @9PM : టాప్ న్యూస్
ఇదిలా ఉంటే.. చంద్రయాన్-3 మిషన్ ఆగస్టు 23 సాయంత్రం చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయింది. దీంతో చంద్రుడిపై ఈ భాగానికి చేరుకున్న తొలి దేశంగా భారత్ నిలిచింది. చంద్రునిపై దిగిన తర్వాత.. ల్యాండర్, రోవర్, ఇతర పేలోడ్‌లు చాలా ముఖ్యమైన డేటాను పంపాయి. ల్యాండర్, రోవర్ ఒక చాంద్రమాన రోజు (సుమారు 14 రోజులు) వరకు పనిచేసేలా రూపొందించబడ్డాయి.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?