జాన్వీ కపూర్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందాల తారా శ్రీదేవి నట వారసురాలిగా సినిమా ఇండస్ట్రీ లో అడుగు పెట్టింది జాన్వీ కపూర్.. బాలీవుడ్ లో వరుస సినిమాలలో నటించి తన నటనతో అందరిని మెప్పించింది. అలాగే టాలీవుడ్ లో కూడా జాన్వీ కపూర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం లో రూపొందుతున్న దేవర సినిమా లో హీరోయిన్ గా పరిచయం అవుతుంది.. ఈ సినిమాలో మత్స్యకారుల ఫ్యామిలీకి చెందిన అమ్మాయి గా జాన్వీ కపూర్ కనిపించబోతున్నట్లుగా సమాచారం.ఇప్పటి వరకు జాన్వీ కపూర్ పాత్ర గురించి ఎలాంటి క్లారిటీ అయితే లేదు. కానీ దేవర సినిమా జాన్వీ కపూర్ కి తెలుగు లో ఒక మంచి బ్రేక్ ఇవ్వడం ఖాయం అని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.బాలీవుడ్ లో జాన్వీ కపూర్ ఎంట్రీ ఇచ్చి అయిదు సంవత్సరాలు అయ్యింది.ఇప్పటి వరకు ఆమె కెరీర్ ను మలుపు తిప్పే హిట్ మాత్రం ఆమెకు దక్కలేదు.. దాంతో తెలుగులో చేస్తున్న దేవర సినిమా అయినా జాన్వీ కి మంచి సక్సెస్ ను తెచ్చి పెడుతుందా అని అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
దేవర సినిమా పై భారీగా అంచనాలు వున్నాయి..తెలుగులో ఈ భామ మరో సినిమాను ఒప్పుకోలేదు. జాన్వీ కపూర్ ఫోకస్ అంతా దేవర సినిమాపై ఉందని తెలుస్తుంది. దేవర సినిమాలో జాన్వీ కపూర్ నటన దేవర సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని సమాచారం. తెలుగులో స్టార్ హీరో ల సినిమాలలో నటించడానికి జాన్వీ కపూర్ కు ఆఫర్స్ వస్తున్నా కానీ దేవర సినిమా విడుదల అయిన తర్వాత మాత్రమే తెలుగు లో తన తదుపరి సినిమా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చినట్లు సమాచారం..జాన్వీ కపూర్ కి బాలీవుడ్ లో అంతగా క్రేజ్ లేదు.. కానీ టాలీవుడ్ లో ఎన్టీఆర్ సినిమాలో నటించడంతో ఈ భామకు క్రేజ్ పెరిగింది. అలాగే ఈ సినిమా కోసం జాన్వీ కపూర్ కు భారీ ఎత్తున పారితోషికం ఇస్తున్నట్లు సమాచారం.. అయితే దేవర సినిమా భారీ విజయం సాధిస్తే జాన్వీ కపూర్ తెలుగు లో వరుస సినిమాలు చేసే అవకాశం ఉంటుంది..దేవర సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5 న గ్రాండ్ గా విడుదల కాబోతుంది.