స్వీటీ అనుష్క శెట్టి గురించి పరిచయం అవసరం లేదు తెలుగు లో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ మంచి గుర్తింపును ఏర్పరచుకుంది అనుష్క.తెలుగులో కొందరి మినహా అందరి స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకుంది. అంతేకాకుండా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా గుర్తింపు ను తెచ్చుకుంది అనుష్క. ఇది ఇలా ఉంటే అనుష్క నుంచి ఎటువంటి సినిమాలు రాక ఇప్పటికీ దాదాపు గా రెండేళ్లు పూర్తి అయిపొయింది.
చివరిగా అనుష్క నిశ్శబ్దం సినిమాలో నటించింది. ఆ తర్వాత అనుష్క సినిమాల కు సంబంధించి ఒక్క వార్త కూడా లేదు. అయితే అంతకుముందు భాగమతి,సైరా నరసింహారెడ్డి సినిమాలలో నటించి మంచి గుర్తింపు ను తెచ్చుకుంది. బాహుబలి సినిమా తర్వాత అనుష్క మరే సినిమా అయితే చేయలేదు. అయితే అనుష్క సినిమాలకు దూరంగా ఉండటంతో ఆమె త్వరలో పెళ్లి చేసుకుంటుంది అంటూ వార్తలు వినిపించినప్పటికీ అవన్నీ రూమర్స్ గానే మిగిలిపోయాయి. ప్రస్తుతం అనుష్క నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అనుష్క చేతిలో ఆ ఒక్క సినిమా మాత్రమే ఉంది. ఇది ఇలా ఉంటే గతంలో అనుష్క ఇంటర్వ్యూలో భాగంగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరల్ గా మారాయి. ఇంటర్వ్యూలో భాగంగా అనుష్క మాట్లాడుతూ.. మీరు నటించిన వాటిలో ఇష్టమైన సినిమా ఏది ఇష్టం లేని సినిమా ఏది అని అడగగా వేదం, అరుంధతి సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం అని ఒక్క మగాడు సినిమా అంటే ఇష్టం లేదు అని తెలిపింది.ఆ సినిమాలో అనుష్క క్యారెక్టర్ చాలా బోల్డ్ గా ఉంటుంది. అస్సలు అలాంటి క్యారెక్టర్ ఎందుకు చేసిందో కూడా అనుష్క అభిమానులకు అర్ధం కాలేదు.ఆ సినిమా అత్యధిక అంచనాలతో వచ్చి భారీ డిజాస్టర్ గా మిగిలింది అని చెప్పాలి.