Mohammad Rizwan in Race For Pakistan Captain: పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ బాబర్ అజామ్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి తాను రాజీనామా చేసినట్లు ఎక్స్‌లో మంగళవారం పోస్టు పెట్టాడు. వ్యక్తిగత ప్రదర్శనపై మరింత దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. సారథ్య బాధ్యతల నుంచి బాబర్ తప్పుకోవడంతో.. తదుపరి కెప్టెన్‌గా ఎవరు ఉంటారనేది ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిగా మారింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈసారి కొత్త క్రికెటర్‌కు కెప్టెన్సీ పదవిని ఇస్తుందని తెలుస్తోంది.
Also Read: Vaibhav Suryavanshi: 58 బంతుల్లోనే సెంచరీ.. అదికూడా ఆస్ట్రేలియాపై! సూర్య చరిత్ర
పాక్ మీడియా ప్రకారం… సీనియర్ బ్యాటర్, వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్‌ను కెప్టెన్‌గా పీసీబీ ఎంపిక చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారికంగా పీసీబీ ఎలాంటి ప్రకటన చేయలేదు. రిజ్వాన్‌ను సారథ్య బాధ్యతలు తీసుకోవాలని కోచ్ గ్యారీ కిరిస్టెన్, పీసీబీ సభ్యులు కోరినట్లు తెగలుస్తోంది. ఇటీవలి వైఫల్యాల కారణంగా బాబర్ అజామ్‌పై విమర్శలు వచ్చినా.. రాజీనామా చేయమని ఎవరూ ఒత్తిడి చేయలేదట. స్వతహాగా అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడట. టెస్టుల్లో షాన్ మసూద్ సారథిగా ఉన్నాడు. వన్డే, టీ20లకు పీసీబీ ఎవరిని కెప్టెన్ చేస్తుందో చూడాలి. పాక్ జట్టును నడిపించేందుకు ఎవరు వచ్చినా.. సవాళ్లు మాత్రం తప్పవని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.