గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “గేమ్ చేంజర్”.ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది .అలాగే క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది.ఈ సినిమాలో రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు.ఈ సినిమాలో రాంచరణ్ రెండు విభిన్న పాత్రలలో నటించనున్నారు .ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన కూడా ఇంకా పూర్తి కాలేదు.కొన్ని అనుకోని కారణాల వలన ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుంది .
ఈ సినిమాతో పాటు శంకర్ విశ్వనటుడు కమల్ హాసన్ తో బ్లాక్ బస్టర్ మూవీ భారతీయుడికి సీక్వెల్ గా భారతీయుడు 2 సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ పూర్తి అయి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా వుంది.ఈ సినిమాను జూన్ లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసారు .అయితే “గేమ్ చేంజర్”సినిమాను అక్టోబర్ లో రిలీజ్ చేయనున్నట్లు గతంలో దిల్ రాజు ప్రకటించారు .అయితే ఈ సినిమా అక్టోబర్ లో రిలీజ్ అయ్యే అవకాశం లేదు.ఆ టైం లో ఎన్టీఆర్ “దేవర” రిలీజ్ వుంది.అక్టోబర్ కంటే ముందు వద్దామన్న ఆగస్టు నెలలో ” పుష్ప 2 ” మూవీ రిలీజ్ కానుంది.అలాగే సెప్టెంబర్ 27 న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన “ఓజి “మూవీ రిలీజ్ కానుంది .దీనితో “గేమ్ చేంజర్” మూవీ దీపావళికి రిలీజ్ అయితే అయినట్లు లేకపోతే వచ్చే ఏడాది మంచి రిలీజ్ డేట్ చూసుకొని విడుదల కానుంది .