Indian 3 : కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా ప్రాంఛైజీ ప్రాజెక్ట్ ఇండియన్ 3. భారతీయుడుకు కొనసాగింపుగా వస్తోన్న ఈ చిత్రంలో కమల్‌హాసన్ టైటిల్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు శంకర్ దర్శకత్వంలో రాంచరణ్ హీరోగా నటిస్తోన్న గేమ్ ఛేంజర్ జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల అయింది. ఇండియన్ 3కి సంబంధించి కొన్ని పోర్షన్లతోపాటు పాట చిత్రీకరణ పెండింగ్‌లో ఉందని కొద్ది రోజులు క్రితం తెలిసిందే.. గేమ్ ఛేంజర్ విడుదల తర్వాత చిత్రీకరణ పూర్తి చేస్తానని శంకర్ లైకా టీంకు చెప్పినట్టు సమాచారం. ఈ విషయంపై శంకర్-లైకా ప్రొడక్షన్స్ మధ్య చర్చలు కొనసాగుతున్నట్టు కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి.
Read Also:MP: ప్రియురాలిని చంపి ఫ్రిజ్‌లో దాచిన ప్రియుడు.. 10 నెలల తర్వాత గుర్తింపు..
ఇండియన్ 2 సినిమా బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ గా నిలవడంతో మళ్ళీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో చేసిన ‘గేమ్ ఛేంజర్’ తో తానేంటో చూపించారు. మరి ఈ సినిమా సమయంలోనే కమల్ హాసన్ తో చేసిన భారీ సినిమా ఇండియన్ 2 అలాగే ఇండియన్ 3లు కూడా ఉన్నాయి. అనుకోని విధంగా ఇండియన్ 2 ఫెయిల్యూర్ గా నిలిచింది. అయినప్పటికీ గేమ్ ఛేంజర్ సినిమా ప్రమోషన్స్ లో శంకర్ ఇండియన్ 3 థియేటర్స్ లోనే రిలీజ్ ఉంటుంది అని కన్ఫర్మ్ చేశారు.
Read Also:NTR : స్కాట్లాండ్‌లో సామాన్యుడిగా వీధుల్లో తిరుగుతున్న ఎన్టీఆర్.. వీడియో వైరల్
కానీ గేమ్ ఛేంజర్ ముందు మాత్రం లైకా వారు కొంచెం ఇబ్బంది పెట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో గేమ్ ఛేంజర్ హిట్ అయితే అది ఇండియన్ 3కే ప్లస్ అవుతుంది అని చాలా కామెంట్లు వినిపించాయి. గేమ్ ఛేంజర్ ఫలితం ఇండియన్ 3 కి మంచి బజ్ తీసుకురావచ్చనే టాక్ కూడా వచ్చింది. సో ఫైనల్ గా గేమ్ ఛేంజర్ ఇపుడు మంచి రెస్పాన్స్ అందుకుంది. సో ఇండియన్ 3కి ఇది ఎంతమేర ప్లస్ అవుతుంది అనేది త్వరలో తెలుస్తోంది ఇండియన్ సినిమా దగ్గర ప్రైడ్ దర్శకుల్లో మావెరిక్ దర్శకుడు శంకర్ కూడా ఒకరు. తాను చేసిన సినిమాలు కొన్నే అయినప్పటికీ తాను వేసుకున్న ముద్ర అంతా ఇంతా కాదు. బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ తోనే నార్మల్ హీరోస్ తో కూడా రికార్డు బాక్సాఫీస్ నంబర్స్ సెట్ చేసిన స్టాండర్డ్స్ శంకర్ కి ఉన్నాయి.