ట్రైన్ ప్రయాణాల్లో తమ పెంపుడు జంతువులను తీసుకెళ్లే వారికి ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించాలని రైల్వే శాఖ యోచిస్తోంది. త్వరలోనే ఈ విధానం అమలులోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తుంది. దీంతో పెట్స్ లవర్స్ కి ఈ వార్త ఉపశమనం కలిగించినట్లైంది. పెంపుడు జంతువులను చాలా మంది ఇష్టపడతారు. ఇంట్లో మనుషులతో సమానంగా వాటిని ట్రీట్ చేశారు.
Also Read : FM Radio On Mobiles: అన్ని మొబైల్ ఫోన్లలో ఎఫ్ఎం రేడియో ఉండాల్సిందే.. కేంద్రం హెచ్చరిక..
ఆ పెంపుడు జంతువులకు ఏదైనా జరిగితే అస్సలు తట్టుకోలేరు. పొరపాటున పెంపుడు జంతువులు తప్పిపోతే కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. అయితే ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు పెంపుడు జంతువులను తమ వెంట తీసుకెళ్ళేందుకు ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా రైలు ప్రయాణ సమయంలో అస్సలు కుదరదు. అటు వదిలి ఉండలేక, ఇటు తమతో తీసుకెళ్లలేక ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు భారతీయ రైల్వే త్వరలో ఓ ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.
Also Read : NEET 2023: నేడే నీట్ పరీక్ష.. అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన కీలక విషయాలు
పెంపుడు కుక్కలు, పిల్లుల కోసం ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ సౌకర్యాన్ని స్టా్ర్ట్ చేసేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రతిపాదనను రెడీ చేసింది. తమతో పాటు పెంపుడు జంతువుల కోసం ఇంట్లో నుంచే టిక్కెట్లను బుక్ చేసుకునేలా ప్రణాళికలు రెడీ చేస్తుంది. ఇకపై IRCTCలో పెంపుడు జంతువులకు టికెట్లను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం యజమానులు తమ పెంపుడు జంతువుల కోసం రైళ్లలో 1వ తరగతి AC టిక్కెట్లు, క్యాబిన్‌లను బుక్ చేసుకుంటున్నారు.
Also Read : Operation Tigers: పల్నాడు అటవీ ప్రాంతంలో ఆపరేషన్ టైగర్స్
కాకపోతే ప్లాట్‌ఫామ్‌లోని పార్శిల్ బుకింగ్ కౌంటర్లను సంప్రదించి టికెట్‌ను రిజర్వ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు పెంపుడు జంతువుల కోసం ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్‌ను రైల్వే మంత్రిత్వ శాఖ ప్రారంభించేందుకు చూస్తుంది. పెట్స్ మాత్రమే కాదు.. ఆవులు, గేదెలు, గుర్రాలు వంటి వాటిని గూడ్స్ రైళ్లలో తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే వాటిని చూసుకోవడానికి ఒక వ్యక్తి ఆ జంతువుల వెంట ఉండేలా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.