FM Radio Mobiles: స్మార్ట్‌ఫోన్‌లలో ఎఫ్ఎం రేడియోను సులభంగా యాక్సెస్ చేయడానికి భారత ప్రభుత్వం మొబైల్ ఫోన్ తయారీదారులకు ఒక సలహాను జారీ చేసింది. అన్ని ఫోన్లలో ఎఫ్ఎం రేడియో ఉండాల్సిందే అని తెలిపింది. దీన వల్ల అత్యవసర పరిస్థితులు, విపత్తుల సమయంలో ప్రజలకు రేడియో సేవల ద్వారా సమాచారాన్ని అందించడం పాటు వినోదాన్ని అందించేలా సహాయపడుతుందని తెలిపింది. ప్రస్తుతం ఉన్న కాలంలో సపరేట్ గా రేడియో సెట్లను కొనుగోలు చేయలేని గ్రామీణ, మారుమూల ప్రాంతాల ప్రజలకు రేడియో సేవలను అందుబాటులోకి తీసుకురడానికి భారత ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
Read Also: Tim Cook: ఆపిల్ లేఆఫ్స్‌పై సీఈఓ టిమ్ కుక్ కీలక వ్యాఖ్యలు..
IT మంత్రిత్వ శాఖ ఇండియన్ సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ICEA) మరియు మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MAIT) లకు అత్యవసర పరిస్థితులు, విపత్తుల సమయంలో ఎఫ్ఎం రేడియో అండుబాటులో ఉండేలా చూడాలని ఓ సలహా జారీ చేసింది. ఇది పేదలకు రేడియో సేవలను అందించడంతో పాటు క్లిష్ట సమయాల్లో ప్రతీ ఒక్కరికి ఎఫ్ఎం కనెక్టివిటీ అందుబాటులో ఉండేలా చేస్తుంది.
మొబైల్ ఫోన్లలో ఇన్ బిల్ట్ ఎఫ్ఎం రేడియో రిసీవర్ ఫీచర్ ఉంటే దాన్ని డిసేబుల్ చేయకుండా, డీయాక్టివేట్ చేయకుండా ఎప్పుడూ యాక్టివేట్ ఉండేలా చూడాలని, ఒక వేళ మొబైల్ ఫోన్లలో ఎఫ్ఎం రేడియో రిసీవర్ ఫంక్షన్ లేకుంటే దాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఐటీ మంత్రిత్వ శాఖ సలహా జారీ చేసింది. ఇటీవల కాలంలో ఎఫ్ఎం రేడియోతో మొబైల్ ఫోన్లు రావడం తగ్గిపోయినట్లు ప్రభుత్వం గమనించినట్లు ఐటీ మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇది ఎఫ్ఎం సేవలపై ఆధారపడే పేదలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోంది. విపత్తులు, క్లిష్ట సమయాల్లో సమాచారా మార్పిడికి ఎఫ్ఎం రేడియో ఉపయోగపడుతుందని ఐటీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. స్మార్ట్ ఫోన్లలో ఎఫ్ఎం రేడియో ఫీచర్ చేర్చాలని సిఫారసు చేసింది.