Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Iran New Supreme Leader Mojtaba Khamenei In Critical Condition

Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా పరిస్థితి విషమం.. తాజా అప్‌డేట్ ఏంటంటే!

Published Date :March 13, 2026 , 10:00 am
By Suresh Maddala
  • ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా పరిస్థితి విషమం
  • ప్రత్యేక భద్రత మధ్య ఆస్పత్రిలో చికిత్స
  • బ్రిటిష్ వార్తాపత్రిక ప్రత్యేక కథనం
Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా పరిస్థితి విషమం.. తాజా అప్‌డేట్ ఏంటంటే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఖమేనీ కుమారుడు మోజ్తాబా ఎన్నికయ్యాడు. దాదాపు వారం రోజులు గడుస్తోంది. కానీ ఇప్పటి వరకు బహిరంగంగా ఎక్కడా ప్రత్యక్షం కాలేదు. దీంతో మోజ్తాబా పరిస్థితిపై రకరకాలైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా అంతర్జాతీయ మీడియాలో సరికొత్త కథనాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ కథనాలపై ఇరాన్ ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించకపోవడం విశేషం.

ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికా జరిపిన సంయుక్త దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హతమయ్యాడు. అనంతరం కొత్త సుప్రీం లీడర్‌గా మార్చి 8న మోజ్తాబా ఖమేనీ ఎన్నికయ్యాడు. మోజ్తాబా మీడియాను ఉద్దేశించి ప్రసంగిస్తారని ఇరాన్ మీడియా తెలిపింది. కానీ ఇప్పటి వరకు మీడియా ముందుకు రాలేదు.

ఈ నేపథ్యంలో ఇరాన్ కొత్త లీడర్ మోజ్తాబా ఆరోగ్యంపై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. తాజాగా బ్రిటిష్ వార్తాపత్రిక ‘‘ది సన్’’ సంచలన కథనాన్ని ప్రచురించింది. మోజ్తాబా కోమాలో ఉన్నారని.. పరిస్థితి విషమంగా ఉందని స్పష్టం చేసింది.

ప్రస్తుతం మోజ్తాబా ఆరోగ్య పరిస్థితిని ఇరాన్ ఆరోగ్య, విద్యామంత్రి మొహమ్మద్ రెజా జాఫర్ గాండి ఆస్పత్రిలో ఉండి పర్యవేక్షిస్తున్నారని పేర్కొంది. టెహ్రాన్‌లోని సినా యూనివర్శిటీ ఆస్పత్రిలో ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్నారని.. భవనంలోని ఒక భాగాన్ని భారీ భద్రత మధ్య మూసివేసినట్లుగా తన కథనంలో నివేదించింది. అలాగే మోజ్తాబా ఒక కాలును కూడా కోల్పోయాడని.. కడుపు, కాలేయానికి తీవ్ర గాయాలు అయినట్లుగా వెల్లడించింది. ఫిబ్రవరి 28న ఖమేనీ చనిపోయినప్పుడే మోజ్తాబా కూడా తీవ్రంగా గాయపడినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇరాన్ మీడియా మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ‘‘రంజాన్ శౌర్యం’’, ‘‘గాయపడిన యోధుడు’’ అంటూ కొనియాడింది.

రెండు రోజుల క్రితం ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ రహస్యంగా మోజ్తాబా ఖమేనీని సందర్శించారని నివేదికలో పేర్కొంది. సినా ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లోకి కొంతమంది అధికారం కలిగిన వ్యక్తులను మాత్రమే అనుమతిస్తారని తెలిపింది. అయితే మోజ్తాబా ఆరోగ్యంపై ఇంత పెద్ద ఎత్తున వదంతులు వ్యాపిస్తున్నా ఇప్పటి వరకు ఇరాన్ ప్రభుత్వం స్పందించలేదు.

ఇక వెలుగులోకి వచ్చిన మోజ్తాబా ఫొటోలు కృత్రిమ ఛాయాచిత్రాలు అని బీబీసీ తెలిపింది. ఏఐ ఆధారిత ఫొటోలు అని పేర్కొంది. ఇక మోజ్తాబా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కీలుబొమ్మగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అభివర్ణించారు. ఒకవేళ కీలు బొమ్మ కాకపోతే ఎందుకు బహిరంగంగా కనిపించడం లేదని నిలదీశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Iran leader news
  • Iran news
  • Iran political crisis
  • Iran Supreme Leader
  • Khamenei family

తాజావార్తలు

  • Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా పరిస్థితి విషమం.. తాజా అప్‌డేట్ ఏంటంటే!

  • Iran War Impact on Pakistan: ఇరాన్‌ యుద్ధం ఎఫెక్ట్‌.. పాకిస్తాన్‌లో సంక్షోభం..!

  • BCCI: 2027 వన్డే వరల్డ్ కప్‌పై బీసీసీఐ ఫోకస్.. రోహిత్, కోహ్లీ కోసం స్పెషల్ ప్లాన్ రెడీ..

  • Team India Squad: టీమిండియాలో పెను మార్పులు.. రాహుల్, పంత్, జడేజా భవిష్యత్తుపై అనిశ్చితి!

  • BCCI: మిగిలిన IPL 2026 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల అప్పుడే..!

ట్రెండింగ్‌

  • Korra Khichdi: బరువు తగ్గి, షుగర్ కంట్రోల్ ఉంచాలా? అయితే కొర్రలతో రుచికరమైన కిచిడీ ట్రై చేయండి..!

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • Subramaniya Bharathi: రోజూ కూలీ కుమారుడు.. తొలి ప్రయత్నంలోనే UPSC క్లియర్.. ఇన్‌స్పైర్ స్టోరీ..!

  • ప్రైవసీ కోసం కొత్త సేవ.. మహిళలకు BSNL ‘Kavach Number’ ప్రారంభం..!

  • టీ20 ప్రపంచకప్ విజయం ప్రేరణగా ‘Ola Champions Edition’ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు.. ఫీచర్స్ ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions