Iran Attack: హిందూ మహాసముద్రంలోని ‘డియాగో గార్సియా’పై ఇరాన్ దాడి.. రెండు క్షిపణుల ప్రయోగం..
- హిందూ హహాసముద్రంలోని అమెరికా స్థావరంపై దాడి..
- రెండు క్షిపణులు ప్రయోగించి ఇరాన్..
- అవి విఫలం అయినట్లు సమచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిందూ మహాసముద్రంలోని అమెరికా, బ్రిటన్లకు చెందిన అత్యంత కీలకమైన ‘డియాగో గార్సియా’ సైనిక స్థావరంపై ఇరాన్ దాడికి ప్రయత్నించిందని ప్రముఖ వార్తా సంస్థ ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ వెల్లడించింది. అయితే.. ఈ దాడిలో ఆ స్థావరానికి ఎటువంటి నష్టం జరగలేదు.
ఏం జరిగింది..?
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్‌తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
నివేదికల ప్రకారం.. ఇరాన్ రెండు శక్తివంతమైన క్షిపణులను ప్రయోగించింది. అందులో ఒకటి గాలిలోనే విఫలం కాగా.. మరొకటి లక్ష్యాన్ని చేరుకోకుండానే అమెరికా యుద్ధనౌక అడ్డుకుంది. అయితే.. ఈ దాడి ఎప్పుడు జరిగిందనే కచ్చితమైన వివరాలను మాత్రం వెల్లడించలేదు. అమెరికా స్థావరాన్ని వాడుకుని ఇరాన్‌పై దాడులు చేయడానికి బ్రిటన్ అనుమతి ఇచ్చిన కొన్ని గంటల్లోనే ఇరాన్ ఈ చర్యకు పాల్పడటం గమనార్హం.
Also Read:Iranian oil: ఇరాన్ చమురుపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా.. ఏప్రిల్ 19 వరకు అమలు..
సాధారణంగా ఇరాన్ దగ్గర ఉన్న క్షిపణులు కేవలం 2,000 నుంచి 3,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను మాత్రమే ఛేదించగలవని అందరూ భావించేవారు. కానీ.. ఇరాన్ నుంచి డియాగో గార్సియా స్థావరం సుమారు 4,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంత దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఇరాన్ గురిపెట్టడం చూస్తుంటే.. వారి క్షిపణుల పరిధి ప్రపంచం ఊహించిన దానికంటే చాలా ఎక్కువని అర్థమవుతోంది.
Also Read:SBI: ఎస్బీఐకి బిగ్ షాక్.. రూ.6,338 కోట్ల పన్ను కట్టాలని నోటీసులు..
నివేదికల ప్రకారం.. ఇరాన్ వద్ద ప్రస్తుతం సుమారు 2,500 నుంచి 3,000 వరకు క్షిపణులు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి.. ఖోరంషహర్. ఇది 2,000 నుంచి 3,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఇమాద్ 1,600 నుంచి 2,000 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. షహాబ్-3 అండ్ రిజ్వాన్.. ఇవి సుమారు 1,400 కిలోమీటర్ల వరకు వెళ్లగలవు. అమెరికాకు చెందిన బాంబర్ విమానాలు మధ్య ప్రాచ్యంలో దాడులు చేయడానికి ఈ ‘డియాగో గార్సియా’ స్థావరం ఒక ముఖ్యమైన స్థావరం. ఇప్పుడు ఇరాన్ క్షిపణులు అక్కడికి కూడా చేరుకోగలవని తెలియడంతో అగ్రరాజ్యం అప్రమత్తమైంది.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్‌తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?