Iran–Israel War Impact: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్.. ఆ మ్యాచులు అన్ని రద్దు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran–Israel War Impact: మిడిల్ ఈస్ట్‌లో పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా–ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్ క్షిపణి దాడులు కొనసాగుతుండటంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) సహా గల్ఫ్ ప్రాంతంలో భద్రతా ఆందోళనలు పెరిగాయి. ఈ పరిణామాల దృష్ట్యా యూఏఈలో ఉన్న తమ జట్లను వెంటనే వెనక్కి పిలిపించేందుకు బోర్డు చర్యలు ప్రారంభించింది.
Israel – Iran War Live Updates: అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్ల దాడి..
Also Read
- Jagga Reddy: ట్విస్ట్ మాములుగా లేదుగా.. సంగారెడ్డిలో పోటీ చేయనన్నా.. కానీ, వేరే చోట పోటీ చేయనలేదు కదా.!
- Vaibhav Sooryavanshi: వైభవ్ ఎంట్రీపై పార్థివ్ పటేల్ సంచలన వ్యాఖ్యలు.. భావోద్వేగం గెలిచింది.. కానీ..!
- మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్‌తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
- Gautam Gambhir: టీమ్ ఇండియా వైఫల్యాలపై ఐదు ప్రశ్నలు.. కోచ్ సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందా..?
ఇందులో భాగంగా ఇంగ్లాండ్ లయన్స్ జట్టు యూఏఈలో పాకిస్తాన్ షహీన్స్ జట్టుతో ఐదు వన్డేల సిరీస్ ఆడుతోంది. ఇప్పటికే రెండో వన్డే రద్దయింది. తాజాగా మిగతా మూడు వన్డే మ్యాచ్‌లను కూడా పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఈసీబీ ప్రకటించింది. ఆటగాళ్లు, సహాయక సిబ్బందిని సురక్షితంగా బ్రిటన్ కు తరలించేందుకు అత్యవసర ఏర్పాట్లు చేపట్టింది. యుద్ధ ప్రభావంతో గల్ఫ్ ప్రాంతంలోని పలు విమానాశ్రయాల్లో విమాన సర్వీసులు అంతరాయం కలగడంతో ప్రయాణ ఏర్పాట్లు కష్టంగా మారాయి.
Tollywood February Box Office Report : ఫిబ్రవరిలో పరాజయాల పరంపర.. ఆదుకోని శ్రీ విష్ణు..
ఈ టూర్‌లో మొత్తం 3 టీ20లు, 5 వన్డేలు జరగాల్సి ఉండగా.. టీ20 సిరీస్‌ను ఇంగ్లాండ్ లయన్స్ 3-0తో కైవసం చేసుకుంది. అనంతరం వన్డే సిరీస్‌ను కూడా విజయంతో ప్రారంభించింది. అయితే రెండో వన్డేకు ముందే ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరగడంతో మిగతా మ్యాచ్‌లు ఆగిపోయాయి. ఈ టూర్ మార్చి 9తో ముగియాల్సి ఉంది. మరోవైపు ఇంగ్లాండ్ మహిళల జట్టు జూన్-జూలైలో బ్రిటన్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్‌కు సన్నాహకంగా అబూదాబిలో శిక్షణ శిబిరాన్ని ప్లాన్ చేసింది. కానీ గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ పరిస్థితులు నెలకొనడంతో ఆ క్యాంప్‌ను కూడా ఈసీబీ పూర్తిగా రద్దు చేసింది. ప్రత్యామ్నాయ ప్రణాళికపై ఇప్పటికే బోర్డు పని ప్రారంభించినట్లు సమాచారం. త్వరలోనే కొత్త షెడ్యూల్‌పై స్పష్టత వచ్చే అవకాశముంది.
తాజావార్తలు
-
Deepika Padukone: 40 ఏళ్ల వయసులో రెండోసారి తల్లి కాబోతున్న దీపిక… త్వరలోనే గుడ్ న్యూస్
-
PM Modi: 2030 నాటికి వాణిజ్యం రెట్టింపు లక్ష్యం.. మోడీ పర్యటనలో భారత్-న్యూజిలాండ్ కీలక నిర్ణయాలు
-
Jagga Reddy: ట్విస్ట్ మాములుగా లేదుగా.. సంగారెడ్డిలో పోటీ చేయనన్నా.. కానీ, వేరే చోట పోటీ చేయనలేదు కదా.!
-
CP Tarun Joshi: 20 నిమిషాల్లోనే ఆరుగురిని చంపేసిన రాజ్ కుమార్.. సంచలన విషయాలు వెలుగులోకి
-
Vaibhav Sooryavanshi: వైభవ్ ఎంట్రీపై పార్థివ్ పటేల్ సంచలన వ్యాఖ్యలు.. భావోద్వేగం గెలిచింది.. కానీ..!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్‌తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!