Iran: మళ్లీ మూతపడ్డ హార్ముజ్ జలసంధి.. ఇరాన్ యు-టర్న్ వెనుక అసలు కారణం ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran: ఇరాన్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది. నిన్న అమెరికాతో రెండు రోజులు కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు ఈ కాల్పుల విరమణకు ముందు ఇరాన్ ముందు పది ప్రతిపాదనలు ఉంచారు. ఇందులో అతి ముఖ్యమైన ప్రతిపాదన హార్ముజ్ జలసంధి(Strait of Hormuz)ని తెరవడం. ఇందుకు ఇరాన్ సైతం అంగీకరించింది. కానీ.. తాజాగా ఇరాన్ హర్మూజ్‌ను మూసివేసినట్లు తెలిపింది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులపై నిరసన ముసివేసినట్లు స్పష్టం చేసింది. ఓ వైపు అమెరికా కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ.. ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్‌పై దాడులు తీవ్ర తరం చేసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఇరాన్ హార్ముజ్‌లో ఆయిల్ ట్యాంకర్ల రాకపోకలను బంద్ చేసింది.
READ MORE: RAAKA : గురువు చేయలేనిది.. శిష్యుడు చేస్తున్నాడా?
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
తాజాగా లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు జరిపింది. అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ కూడా భాగమేనని ఇరాన్ వాదిస్తోంది. అయితే, ఇజ్రాయెల్ మాత్రం ఈ ఒప్పందానికి లెబనాన్‌తో సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ బుధవారం లెబనాన్‌పై చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయిలో విరుచుకుపడింది. 100కు పైగా హిజ్బుల్లా కమాండ్ సెంటర్లు, సైనిక స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో సుమారు 254 మంది ప్రాణాలు కోల్పోగా, 800 మందికి పైగా గాయపడ్డారు. దీంతో ఇరాన్ ఆగ్రహించింది. “జియోనిస్ట్ (ఇజ్రాయెల్) దాడులకు నిరసనగా హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలను తక్షణమే నిలిపివేస్తున్నాం. కాల్పుల విరమణ అనేది అన్ని రంగాల్లో అమలు కావాలి, లేదంటే ఎక్కడా ఉండదు” అని ఇరాన్ పార్లమెంటరీ కమిటీ ప్రతినిధి ఇబ్రహీం రెజాయ్ ఘాటుగా స్పందించారు. ఈ నిర్ణయంతో మారోసారి ప్రపంచ దేశాల చమురు సరాఫరకు ఇబ్బందిగా మారింది. \
ఈ అంశంపై తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందించారు. “గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరాన్ బలహీనపడింది.. ఇరాన్ యుద్ధంలో పెద్దఎత్తున లక్ష్యాలను సాధించాం.. అమెరికా అధ్యక్షుడి సహకారం చాలా గొప్పది.. ట్రంప్‌తో సంబంధాలు చాలా బలంగా ఉన్నాయి.. నాయకత్వం వహించిన ట్రంప్‌కు ధన్యవాదాలు.. మా వేలు ట్రిగ్గర్‌పై సిద్ధంగా ఉంది.. కాల్పుల విరమణ లెబనాన్‌కు వర్తించదు.. లెబనాన్.. సంధిలో భాగం కాదు.. హెజ్బొల్లాపై దాడులు కొనసాగిస్తాం.” అని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!