iQOO Neo 9 Pro Launch: ఐకూ నుంచి మరో ఫ్లాగ్షిప్ ఫోన్.. 50 ఎంపీ కెమెరా, 5160 ఎంఏహెచ్ బ్యాటరీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iQOO Neo 9 Pro 5G Smartphone Launched in India: చైనాకు చెందిన మొబైల్ కంపెనీ ‘ఐకూ’ భారత మార్కెట్లో మరో స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. నియో సిరీస్‌లో భాగంగా ‘ఐకూ నియో 9ప్రో’ని గురువారం భారతదేశంలో లాంచ్ చేసింది. ఐకూ 9 సిరీస్ గత డిసెంబర్ చివరిలో చైనాలో ప్రారంభమైంది. 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 920 సెన్సర్ కెమెరా, 5160 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ వస్తుంది. ఇందులో ఔటాఫ్‌ది బాక్స్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్‌తో పాటు మరో మూడు ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తామని ఐకూ పేర్కొంది.
iQOO Neo 9 Pro Offers:
ఐకూ నియో 9 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు ఫిబ్రవరి 23 నుంచి ఆరంభం రానున్నాయి. ప్రీ బుక్ చేసుకున్న వారు ఫిబ్రవరి 22 మధ్యాహ్నం నుంచే కొనుగోలు చేయొచ్చు. అయితే బేస్ వేరియంట్ మాత్రం మార్చి 21న నుంచి అందుబాటులోకి వస్తుంది. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్, ఐకూ ఇ-స్టోర్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులపై కొనుగోలు చేస్తే రూ.2వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు.
Also Read
iQOO Neo 9 Pro Price:
ఐకూ నియో 9 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. బేస్ వేరియంట్ 8జీబీ+128జీబీ ధర రూ.35,999 కాగా.. 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.37,999గా ఉంది. ఇక హై ఎండ్ 12జీబీ+256 జీబీ వేరియంట్ ధర రూ.39,999గా ఉంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్ నలుపు, ఎరుపు రంగుల్లో లభిస్తుంది.
iQOO Neo 9 Pro Specs:
ఐకూ నియో 9 ప్రోలో 6.78 ఇంచెస్ 1.5k ఎల్టీపీఓ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేటు కలిగి ఉండగా.. గేమింగ్ సమయంలో 144Hz రిఫ్రెష్ రేటుతో పని చేస్తుంది. కొత్తగా వెట్ టచ్ టెక్నాలజీని ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఇచ్చారు. దీంతో తడి చేత్తో ఫోన్‌ను ఆపరేట్ చేసినా… డిస్ప్లే పని చేస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 చిప్సెట్తో ఇది వస్తోంది.
Also Read: Yashasvi Jaiswal: బాంద్రాలో ఖరీదైన ఫ్లాట్ కొన్న యశస్వి జైస్వాల్.. ధర ఎంతంటే?
iQOO Neo 9 Pro Camera and Battery:
ఐకూ నియో 9 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 50ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 920 సెన్సర్ ప్రధాన కెమెరా ఇచ్చారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో ఇది వస్తోంది. 8 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16 ఎంపీ కెమెరాఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,160 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా.. ఇది 120W సూపర్‌వూక్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!