Hardik Pandya: గుజరాత్ టైటాన్స్‌కు కాదు.. ముంబై ఇండియన్స్‌కే హార్దిక్ పాండ్యా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL Team Gujarat Titans Retentions and Released Players List: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ జట్టు తరఫున ఆడనున్నాడు. గుజరాత్ టైటాన్స్ రిటైన్ ఆటగాళ్ల జాబితాలో ప్రస్తుతం హార్దిక్ పేరు ఉన్నప్పటికీ.. డిసెంబర్ 12 వరకు ట్రేడింగ్ జరుగనుండడంతో అతడు ముంబైకి మారనున్నాడని సమాచారం తెలుస్తోంది. ఇదే జరిగితే.. ఐపీఎల్‌లో ఇదే అతిపెద్ద డీల్‌గా చెప్పుకోవచ్చు.
ఐపీఎల్ 2024 మినీ వేలం డిసెంబర్ 19న దుబాయ్‌లో జరుగనున్నది. అంతకుముందే గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ట్రేడింగ్ జరగనుందట. ఈ ట్రేడింగ్‌లో హార్దిక్ గుజరాత్ నుంచి ముంబై మారనున్నాడని తెలుస్తోంది. ఈ విషయమై మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది. చూడాలి మరి హార్దిక్ గుజరాత్‌తోనే ఉంటాడా? లేదా ముంబైకి మారుతాడా?. 2015లో ముంబైతో ఐపీఎల్ కెరీర్ ఆరంభించిన హార్దిక్.. నాలుగుసార్లు టైటిల్ సాధించిన జట్టులో ఉన్నాడు. 2022లో టైటాన్స్‌కు మారి కెప్టెన్‌గా టైటిల్ అందించాడు. గత యేడాది గుజరాత్ రన్నరప్‌గా నిలిచింది.
Also Read
- UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
- Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
- Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
- Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
గుజరాత్ టైటాన్స్ 8 మంది ఆటగాళ్లను మాత్రమే రిలీజ్ (GujaratTitans Released Players List) చేసింది. తెలుగు తేజం కేఎస్ భరత్‌కు టైటాన్స్ ఉద్వాసన పలికింది. యశ్ దయాల్, శివమ్ మావి, ఉర్విల్ పటేల్, ప్రదీప్ సంగ్వాన్, ఓడియన్ స్మిత్, అల్జారీ జోసెఫ్, డసన్ షనకలకు కూడా గుడ్‌బై చెప్పింది. దాదాపు కోర్ టీమ్ మొత్తాన్ని టైటాన్స్ రిటైన్ చేసుకుంది.
Also Read: Gold Price Today : స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు.. ఈరోజు తులం ఎంతంటే?
గుజరాత్ టైటాన్స్ రిటైన్ లిస్ట్ (GujaratTitans Retained Players List):
డేవిడ్ మిల్లర్, శుభ్‌మన్ గిల్, మాథ్యూ వేడ్, వృద్దిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, దర్శన్ నలకందే, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, రాహుల్ తేవాటియా, మహమ్మద్ షమీ, నూర్ అహ్మద్, సాయి కిషోర్, రషీద్ ఖాన్, జోషువా లిటిల్, మోహిత్ శర్మ.
తాజావార్తలు
-
UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
-
DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ‘డిగ్గర్’
-
Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
-
Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
ట్రెండింగ్
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?