భారత క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడని ఎదురుచూస్తున్న ఐపిఎల్ కేవలం ఐదు రోజుల్లో ఐపీఎల్ 17వ సీజన్ చెన్నై వేదికగా మొదలు కాబోతుంది. మార్చి 22 నుండి ఈ సీజన్ లో లీగ్ దశ మొదలు కాబోతోంది. ఇందులో భాగంగా.. మర్చి 22న తొలి మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య రాత్రి 7:30 గంటలకు జరగబోతోంది.
Also Read: Betting: ఆయనకి టిక్కెట్ ఇచ్చినందుకు.. అర గుండు, అర మీసం గీయించుకున్న వ్యక్తి..!
తొలి మ్యాచ్ కావడంతో ఆరోజున సీజన్ ప్రారంభోత్సవం సందర్భంగా.. కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించబోతోంది బీసీసీఐ. ఇక ఈ మ్యాచ్ కు సంబంధించి టికెట్ల విక్రయం మార్చి 18 ఉదయం 9:30 గంటల సమయం నుండి ఆన్లైన్ లో మొదలు కాబోతోంది. ఈ టికెట్స్ కు సంబంధించి పేటీఎం, చెన్నై సూపర్ కింగ్స్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా టికెట్లను కొనుగోలు చేయొచ్చు అని సీఎస్కే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కెఎస్ విశ్వనాథన్ తెలిపారు.
Also read: PM MODI : వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మోడీ..!
ఇక ఈ మ్యాచ్ కు సంబంధించి టికెట్ల విషయానికి వస్తే.. స్టేడియంలో ఉన్న సి, డి, ఈ లోయర్ టికెట్ ధర రూ. 1700 కాగా.., ఐ, జె, కె అప్పర్ రూ. 4000 ఉండగా., ఐ, జె, కె లోయర్ రూ. 4500 గా నిర్ణయించారు. వీటితో పాటు కేఎంకే టెర్రస్ టికెట్ ధర రూ. 7500 నిర్ణయించబడింది. అలాగే సి, డి, ఈ అప్పర్ రూ. 4000 గా టికెట్ ధరను నిర్ణయించారు. కాబట్టి ఎవరైనా మ్యాచ్ కి వెళ్లి చూడాలని అనుకుంటారో వారు సదరు వెబ్సైట్స్ కి వెళ్లి టికెట్లను కొనుగోలు చేసుకోవచ్చు. అయితే ఒక్కరికి రెండు టికెట్లు మాత్రమే ఇవ్వబడతాయి.