Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ipl 2026 Ipl 2026 Vaibhav Suryavanshi Child Labor Controversy Activist Threatens Rr

Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..

Published Date :May 2, 2026 , 6:31 pm
By Burugadda Veerababu
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) తరపున సంచలన ఇన్నింగ్స్‌లతో దూసుకుపోతున్న 15 ఏళ్ల బీహార్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు ఒక కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. మైదానంలో సిక్సర్ల వర్షం కురిపిస్తున్న ఈ పిల్లాడిపై ఒక కన్నడ సామాజిక కార్యకర్త సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వైభవ్ సూర్యవంశీ బీహార్‌లోని తాజ్‌పూర్ అనే చిన్న గ్రామం నుంచి వచ్చాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ వేలంలో రూ. 1.1 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి ఎంపికై చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌పై కేవలం 37 బంతుల్లోనే 103 పరుగులు చేసి, ఐపీఎల్ చరిత్రలోనే అతిపిన్న వయసులో సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. తన అటాకింగ్ బ్యాటింగ్‌తో ప్రత్ర్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న వైభవ్, భారత క్రికెట్ భవిష్యత్ స్టార్‌గా మారుతాడని అందరూ భావిస్తున్నారు.

వివాదం ఏమిటి…?

Also Read

  • Abhishek Sharma: హనుమాన్ ఆలయంలో కాటేరమ్మ కొడుకు.. రేపు దబిడిదిబిడే..
  • Preity Zinta: పంజాబ్ తొలి ఓటమిపై.. రెండు రోజుల తర్వాత స్పందించిన ప్రీతి జింటా.. ఏమన్నారంటే..
  • MS Dhoni: "ధోనీ ఎక్కడ?".. కనీసం డగౌట్‌లోనూ కనిపించని మిస్టర్ కూల్.. అసలు గుట్టు విప్పిన కోచ్
  • IPL 2026 Centuries: 'వంద' కొడితే ఓటమే.. ఐపీఎల్ 2026లో ఆసక్తికర ట్రెండ్!

కన్నడ టీవీ ఛానల్‌లో ఒక యాక్టివిస్ట్ (సామాజిక కార్యకర్త) మాట్లాడుతూ వైభవ్ సూర్యవంశీ ఆడటం “చైల్డ్ లేబర్” కిందకు వస్తుందని ఆరోపించారు. ఆయన వాదన ప్రకారం.. ‘15 ఏళ్ల పిల్లాడిని ప్రొఫెషనల్ క్రికెట్‌లో పని చేయించడం చట్టవిరుద్ధం. వైభవ్ సూర్యవంశీ ఒక చిన్న పిల్లాడు. అతడికి ఆడుకోవాల్సిన వయసులో లక్షల రూపాయల కాంట్రాక్టులు ఇచ్చి మైదానంలో శ్రమ చేయించడం సరికాదు. ఇది భారత బాలకార్మిక చట్టాల ఉల్లంఘన కిందకు వస్తుంది. రాజస్థాన్ రాయల్స్ టీమ్ వెంటనే అతడిని తొలగించాలి, లేకపోతే నేను చట్టపరమైన చర్యలు తీసుకుంటాను’ అని హెచ్చరించాడు.

చట్టం ఏం చెబుతోంది..?

భారతదేశంలోని చైల్డ్ లేబర్ యాక్ట్ ప్రకారం.. 14 ఏళ్ల లోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం నేరం. అయితే, 14-18 ఏళ్ల లోపు వారిని ‘అడోలెసెంట్స్’ (Adolescents)గా పరిగణిస్తారు. వీరిని ‘ప్రమాదకరమైన పనుల్లో’ తప్ప ఇతర రంగాల్లో పని చేయించడానికి కొన్ని షరతులతో అనుమతి ఉంది. క్రీడలు, వినోద రంగం (సినిమాలు, టీవీ) వంటి వాటిని సాధారణంగా ప్రమాదకరమైనవిగా పరిగణించరు. బీసీసీఐ, ఐపీఎల్ నిబంధనల ప్రకారమే అతడిని వేలంలో చేర్చారు.

This language activist says,

He is going to file a case against Rajasthan Royals owners for using Vaibhav Suryavanshi as child labour 🤦‍♂️

A few words for him.. pic.twitter.com/6IFqYX6NdD

— Vije (@vijeshetty) May 2, 2026

ఈ వివాదం ఒకవైపు నడుస్తుంటే, వైభవ్ మాత్రం మైదానంలో తన బ్యాట్‌తోనే సమాధానం చెబుతున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటికే 350కి పైగా పరుగులు సాధించి పాయింట్ల పట్టికలో రాజస్థాన్‌ను టాప్ 4లో నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. పాకిస్థానీ నిపుణులు ఆయన బ్యాట్‌లో ‘ఏఐ చిప్’ ఉందని చేసిన వింత ఆరోపణలను కూడా ఆయన హాస్యంతో తిప్పికొట్టాడు. ప్రస్తుతానికి ఈ ‘చైల్డ్ లేబర్’ ఆరోపణలపై రాజస్థాన్ రాయల్స్ లేదా బీసీసీఐ అధికారికంగా స్పందించలేదు. ఒకవేళ ఫిర్యాదు నమోదైతే చట్టం ఏ విధంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BCCI Age Rules IPL
  • Child Labor Act India Sports
  • Rajasthan Royals 15 Year Old Player
  • RR Opening Batter Controversy
  • Vaibhav Suryavanshi Century vs SRH

తాజావార్తలు

  • Central Govt: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. బీమా రంగంలోనే సంచలనం..

  • US-Iran War: “ట్రంప్‌పై నమ్మకం లేదు”.. అమెరికాపై ఇరాన్ అనుమానాలు..

  • Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..

  • Nashik TCS Case: టీసీఎస్ నాసిక్ నిందితురాలు నిదా ఖాన్‌కు షాక్..

  • T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్‌కు భారత మహిళల జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions