Preity Zinta: పంజాబ్ తొలి ఓటమిపై.. రెండు రోజుల తర్వాత స్పందించిన ప్రీతి జింటా.. ఏమన్నారంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 సీజన్ సగం ముగిసే సమయానికి పంజాబ్ కింగ్స్ పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. గత సీజన్లలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ, ఈ ఏడాది శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో జట్టు సమన్వయంతో ఆడుతూ పటిష్టమైన స్థితికి చేరుకుంది. వరుస విజయాలతో ప్లే-ఆఫ్స్‌కు చేరువైన పంజాబ్, అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.
ప్రీతి జింటా స్పందన…
సీజన్‌లో తొలి ఓటమిని చవిచూసిన రెండు రోజుల తర్వాత.. ప్రీతి జింటా ‘X’ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. పంజాబ్ చివరి హోమ్ మ్యాచ్‌లో విజయం సాధించలేకపోవడం పట్ల ఆమె కొంత అసంతృప్తి వ్యక్తం చేసినా, జట్టు ఓవరాల్ ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. “మా షేర్ స్క్వాడ్ అద్భుత ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండటం గర్వంగా ఉంది. పంజాబ్ గ్రౌండ్‌లో చివరి మ్యాచ్ ఆశించినట్లు జరగలేదు.. కానీ ఇంకా ముందు చాలా మ్యాచ్‌లు ఉన్నాయి” అని ఆమె పేర్కొన్నారు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
8 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో, 1.043 నెట్ రన్ రేట్‌తో పంజాబ్ 13 పాయింట్లు సాధించింది. ప్లే-ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకోవడానికి జట్టుకు మరో 3 పాయింట్లు మాత్రమే అవసరం. టాప్-2లో నిలిచి ఫైనల్‌కు వెళ్లడానికి రెండు అవకాశాలు (క్వాలిఫైయర్స్) పొందడమే లక్ష్యంగా జట్టు ఆడుతోంది.
గుజరాత్ టైటాన్స్‌పై విజయంతో మొదలైన వీరి ప్రయాణం.. చెన్నై, హైదరాబాద్, ముంబై వంటి బలమైన జట్లను ఓడించే వరకు సాగింది. రాజస్థాన్ రాయల్స్ చేతిలో తొలి ఓటమి ఎదురైనప్పటికీ, పంజాబ్ పటిష్టంగా ఉంది. బ్యాటింగ్‌లో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (346 పరుగులు) జట్టును ముందుండి నడిపిస్తుండగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (309 పరుగులు) బాధ్యతాయుతంగా ఆడుతున్నారు. ముఖ్యంగా ప్రియాన్ష్ ఆర్య 250.44 స్ట్రైక్ రేట్‌తో మెరుపులు మెరిపిస్తూ ప్రత్యర్థి బౌలర్లకు సవాల్ విసురుతున్నారు. తదుపరి మ్యాచ్‌లు ధర్మశాల వేదికగా జరగనున్నాయి.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!