Central Govt: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. బీమా రంగంలోనే సంచలనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీమా కంపెనీలలో ఆటోమేటిక్ రూట్ ద్వారా 100 శాతం FDI కి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనివల్ల విదేశీ కంపెనీలు భారతీయ బీమా సంస్థలలో పూర్తి వాటాను పొందే అవకాశం ఉంటుంది. అయితే.. ఈ పెట్టుబడులు కచ్చితంగా ‘బీమా చట్టం 1938’ కు లోబడి ఉండాలి. అంతే కాకుండా.. IRDAI నుంచి అవసరమైన లైసెన్సులు లేదా ఆమోదాలు పొందాల్సి ఉంటుంది. అయితే భారత ప్రభుత్వానికి చెందిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) విషయంలో మాత్రం పాత నిబంధనలే వర్తిస్తాయి. LICలో విదేశీ పెట్టుబడుల పరిమితి కేవలం 20 శాతానికే పరిమితం చేయబడింది. ఇది ‘LIC చట్టం 1956’ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించబడుతుంది. ఇతర ప్రైవేట్ బీమా కంపెనీలతో పోలిస్తే LICకి ప్రత్యేక ఫ్రేమ్‌వర్క్ కొనసాగుతుంది.
విదేశీ పెట్టుబడులు పెరిగినప్పటికీ, కంపెనీలపై నియంత్రణ భారతీయ పౌరుల చేతుల్లోనే ఉండేలా కొన్ని కీలక నిబంధనలు విధించారు. బీమా కంపెనీలో ఛైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ (MD), లేదా CEO లలో కనీసం ఒకరు ఖచ్చితంగా భారతీయ నివాసి అయి ఉండాలి. ఇది కీలక నిర్ణయాధికారాల్లో దేశీయ ప్రయోజనాలను కాపాడటానికి సహాయపడుతుంది.
Also Read
- Banks Merged: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మరో రెండు బ్యాంకులు విలీనం..!
- Ethanol Car: పెట్రోల్‌తో పని లేదు.. 100 శాతం ఇథనాల్‌తో నడిచే కారు.. అక్టోబర్‌లోనే లాంచ్..
- Bank Strike: బ్యాంక్‌ల సమ్మె వేళ గుడ్ న్యూస్.. వాటికి ఛార్జీలు రద్దు.. SBI ఖాతాదారులకు భారీ ఊరట
- New Scheme: NPS పెన్షన్‌లో ఇప్పుడు ఆరోగ్య బీమా కూడా.. ఫ్యామిలీ మొత్తానికి వర్తింపు.. అక్టోబర్ 1 నుంచే అమల్లోకి..
బీమా కంపెనీలతో పాటు.. ఈ రంగంలోని మధ్యవర్తులకు కూడా 100 శాతం FDI వర్తిస్తుంది. ఇందులో ప్రధానంగా.. ఇన్సూరెన్స్ బ్రోకర్లు, రీఇన్సూరెన్స్ బ్రోకర్లు, థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్లు (TPA), సర్వేయర్లు మరియు లాస్ అసెసర్లు, కార్పొరేట్ ఏజెంట్లు, కన్సల్టెంట్లు ఉంటారు. ఈ మార్పుల వల్ల బీమా రంగంలోకి భారీగా విదేశీ మూలధనం వచ్చే అవకాశం ఉంది. ఇది పోటీని పెంచడమే కాకుండా, కొత్త టెక్నాలజీని తీసుకురావడానికి, దేశవ్యాప్తంగా బీమా వ్యాప్తిని మెరుగుపరచడానికి దోహదపడుతుంది. అదే సమయంలో నియంత్రణ నిబంధనల ద్వారా వినియోగదారుల ప్రయోజనాలను కూడా రక్షించడం జరిగింది.
తాజావార్తలు
-
CEC Impeachment: CEC జ్ఞానేష్ కుమార్‌ను తొలగించడం అంత ఈజీ కాదు.. రాజ్యాంగం ఏం చెబుతోంది.?
-
Banks Merged: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మరో రెండు బ్యాంకులు విలీనం..!
-
Tejasvi Surya: జీన్ జీ అయినా.. ఎవరైనా నిజాయితీ నాయకులనే కోరుకుంటారు
-
Mohan Babu: “నాని పర్మిషన్తో నన్ను పెట్టుకోవడానికి వచ్చావా? అక్కడ కొట్టింది నా ఈగో”
-
Iran-US: అమెరికాకు ఇరాన్ తాజా హెచ్చరిక.. ఈసారి చిన్న తప్పు చేసినా..!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?