Nashik TCS Case: టీసీఎస్ నాసిక్ నిందితురాలు నిదా ఖాన్‌కు షాక్..
- టీసీఎస్ నాసిక్ కేసులో కీలక పరిణామం..
- నిందితురాలు నిదా ఖాన్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nashik TCS Case: టీసీఎస్ నాసిక్ కేసు దేశవ్యాప్తంగా ఎంత సంచలనంగా మారిందో అందరికి తెలుసు. ఉన్నతస్థానాల్లో ఉన్న ఉద్యోగులు మతమార్పిడి, లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో నిందితురాలు నిదా ఖాన్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను నాసిక్ కోర్టు శనివారం తిరస్కరించింది. ప్రభుత్వం తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అజయ్ మిసర్ కోర్టులో హాజరయ్యారు. నిందితుల తరఫున న్యాయవాది రాహుల్ కస్లివాల్ తన వాదనలను వినిపించారు. ఏప్రిల్ 29న ఈ పిటిషన్‌పై విచారణ జరగగా, నేను కోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించింది.
నాసిక్ టీసీఎస్ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత నుంచి నిందితురాలు నిదాఖాన్ పరారీలో ఉన్నారు. ఏప్రిల్ 18న ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నిందితురాలు బాధితుల్ని మతపరమైన ఆచారాలు పాటించేలా ప్రభావితం చేసేలా చేసిందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. బాధితులకు హిజాబ్ ధరించడం, ఇస్లాంకు సంబంధించిన మత సూత్రాలను చెప్పడం వంటివి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ కేసుకు మలేషియాతో లింకులు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై సిట్ దర్యాప్తు చేస్తోంది.
Also Read
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
Read Also: JD Chakravarthy: “ఆర్జీవీ నా బలం.. కంటెంట్ ఉంటేనే సినిమా కింగ్”.. జేడీ చక్రవర్తి
ఈ కేసులో ఏడుగురిని ఇప్పటికే అరెస్ట్ చేయగా, మరో నిందితురాలు నిదా ఖాన్ పరారీలో ఉంది. ఇప్పటి వరకు ఈ కేసులో డానిష్ షేక్, తౌసిఫ్ అత్తర్, రజా మెమన్, షారుఖ్ ఖురేషి, షఫీ షేక్, ఆసిఫ్ అఫ్తాబ్ అన్సార్, షారుఖ్ షేక్, టీసీఎస్ BPO యూనిట్ ఆపరేషన్స్ హెడ్ అరెస్టులు జరిగాయి. టెలికాలర్‌గా పనిచేస్తున్న నిదా ఖాన్, బాధిత మహిళలు చేసిన ఫిర్యాదులను పట్టించుకోలేదు. ఫిర్యాదు చేస్తున్నవారిని నిరుత్సాహపరిచేలా వ్యవహరించారు. కార్పొరేట్ వరల్డ్‌లో ఇదంతా సహజమే అంటూ బాధితులను కించపరిచారని తెలుస్తోంది. 25 ఏళ్ల నిదాఖాన్, 2021లో నాసిక్ టీసీఎస్ బీపీఓలో ఉద్యోగంలో చేరారు.ఈ కేసులో ఇప్పటి వరకు 9 మంది బాధితులు మందుకు వచ్చారు. ఇందులో 8 మంది మహిళలు కాగా, ఒక పురుషుడు ఉన్నాడు. ఈ వ్యవహారంపై మహారాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ కేసులో వేధింపులు 2022 నుంచి 2026 మధ్య జరిగినట్లు విచారణలో తేలింది. అయితే, ఈ మతమార్పిడి, కార్పొరేట్ జిహాద్ వెనక అంతర్జాతీయ కుట్ర ఉందా.? అనే కోణంలో కూడా విచారణ సాగుతోంది.
తాజావార్తలు
-
EC Orders Voter List Revision in 17 States: ఓటర్లకు కీలక సమాచారం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఈసీ ఆదేశాలు!
-
Telangana Inter Exam Fee : తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల..
-
Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
-
iPhone Duo Repair Cost: రూ.3 లక్షల iPhone Duo.. స్క్రీన్ రిపేర్‌కే రూ.1.49 లక్షలు! రిపేర్ ధరల పూర్తి జాబితా ఇదే
-
January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!