MS Dhoni: “ధోనీ ఎక్కడ?”.. కనీసం డగౌట్‌లోనూ కనిపించని మిస్టర్ కూల్.. అసలు గుట్టు విప్పిన కోచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ అంటేనే టక్కున గుర్తుకు వచ్చేది మిస్టర్ కూల్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ. ధోనీ (MS Dhoni) మైదానంతో సంబంధం లేకుండా తన ఆట తీరు, వ్యక్తిత్వంతో కోట్ల మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక 2026 సీజన్ విషయానికి వస్తే ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అంతే కాదు.. చెన్నై సూపర్ కింగ్స్ డగౌట్‌లోనూ మహేంద్ర సింగ్ ధోనీ కనిపించకపోవడం అభిమానుల్లో ఎన్నో అనుమానాలకు, చర్చలకు దారితీసింది. ఈ మిస్టరీని ఛేదిస్తూ సీఎస్‌కే బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముంబై ఇండియన్స్‌తో జరగనున్న కీలక పోరుకు ముందు మాట్లాడిన హస్సీ.. ధోనీ మైదానానికి దూరంగా ఉండటం వెనుక ఉన్నది అహంకారం కాదు, జట్టు పట్ల ఆయనకున్న నిస్వార్థ ప్రేమేనని స్పష్టం చేశారు.
ధోనీ డగౌట్‌లో ఉంటే కెమెరాలన్నీ ఆయన వైపే ఉంటాయని, స్టేడియం మొత్తం ధోనీ నామస్మరణతో హోరెత్తిపోతుందని, దీనివల్ల ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్ల ఏకాగ్రత దెబ్బతింటుందని ‘మిస్టర్ కూల్’ భావిస్తున్నారట. జట్టు ప్రదర్శనపైనే అందరి దృష్టి ఉండాలని, తన వల్ల ఎలాంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతోనే మ్యాచ్ రోజున స్టేడియానికి రావడం లేదని హస్సీ వివరించారు. ధోనీ ఆలోచన సరైనదా కాదా అన్నది పక్కన పెడితే, టీమ్ ప్రయోజనాలే ముఖ్యమని భావించే వ్యక్తిత్వానికి ఇది నిదర్శనమని కోచ్ కొనియాడారు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ప్రస్తుతం ధోనీ ఒకవైపు పిక్క గాయం (Calf Injury) నుంచి కోలుకుంటూనే, మరోవైపు నెట్స్‌లో ఆటగాళ్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రాక్టీస్ సెషన్లలో చురుగ్గా పాల్గొంటూ తన అనుభవాన్ని కుర్రాళ్లతో పంచుకుంటున్నారు. ఇక ధోనీ ఎప్పుడు బరిలోకి దిగుతారన్న ప్రశ్నకు కోచ్ స్పందిస్తూ.. ఆయన రన్నింగ్ వేగం పుంజుకుందని, బ్యాటింగ్, వికెట్ కీపింగ్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదని హస్సీ ధీమా వ్యక్తం చేశారు. తన గాయం పూర్తిగా నయమైందని ధోనీకి నమ్మకం కలిగిన వెంటనే, బహుశా తదుపరి మ్యాచ్‌లలోనే ఆయన మళ్లీ పసుపు రంగు జెర్సీలో మైదానంలో మెరిసే అవకాశం ఉందని క్లారిటీ ఇచ్చారు.
తాజావార్తలు
-
e-SPRINTO G1: రూ.లక్షలోపే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క ఛార్జ్‌తో 130 కి.మీ. రేంజ్!
-
Railway Bonus: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్, సామాజిక పింఛన్లకు రూ.53,428 కోట్లు!
-
TDP-Janasena Seat Sharing Talks: సీట్ల లొల్లి.. కూటమి ముందు జనసేన భారీ డిమాండ్..
-
Tollywood: దసరా వార్‌లో నైజాంను క్లీన్ స్వీప్ చేసిన మైత్రీ!
-
Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..