Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ (RR) తరపున సంచలన ఇన్నింగ్స్‌లతో దూసుకుపోతున్న 15 ఏళ్ల బీహార్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు ఒక కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. మైదానంలో సిక్సర్ల వర్షం కురిపిస్తున్న ఈ పిల్లాడిపై ఒక కన్నడ సామాజిక కార్యకర్త సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వైభవ్ సూర్యవంశీ బీహార్‌లోని తాజ్పూర్ అనే చిన్న గ్రామం నుంచి వచ్చాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ వేలంలో రూ. 1.1 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి ఎంపికై చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్లో సన్‌రైజర్స్‌పై కేవలం 37 బంతుల్లోనే 103 పరుగులు చేసి, ఐపీఎల్ చరిత్రలోనే అతిపిన్న వయసులో సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. తన అటాకింగ్ బ్యాటింగ్‌తో ప్రత్ర్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న వైభవ్, భారత క్రికెట్ భవిష్యత్ స్టార్‌గా మారుతాడని అందరూ భావిస్తున్నారు.
వివాదం ఏమిటి…?
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
కన్నడ టీవీ ఛానల్లో ఒక యాక్టివిస్ట్ (సామాజిక కార్యకర్త) మాట్లాడుతూ వైభవ్ సూర్యవంశీ ఆడటం “చైల్డ్ లేబర్” కిందకు వస్తుందని ఆరోపించారు. ఆయన వాదన ప్రకారం.. ‘15 ఏళ్ల పిల్లాడిని ప్రొఫెషనల్ క్రికెట్లో పని చేయించడం చట్టవిరుద్ధం. వైభవ్ సూర్యవంశీ ఒక చిన్న పిల్లాడు. అతడికి ఆడుకోవాల్సిన వయసులో లక్షల రూపాయల కాంట్రాక్టులు ఇచ్చి మైదానంలో శ్రమ చేయించడం సరికాదు. ఇది భారత బాలకార్మిక చట్టాల ఉల్లంఘన కిందకు వస్తుంది. రాజస్థాన్ రాయల్స్ టీమ్ వెంటనే అతడిని తొలగించాలి, లేకపోతే నేను చట్టపరమైన చర్యలు తీసుకుంటాను’ అని హెచ్చరించాడు.
చట్టం ఏం చెబుతోంది..?
భారతదేశంలోని చైల్డ్ లేబర్ యాక్ట్ ప్రకారం.. 14 ఏళ్ల లోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం నేరం. అయితే, 14-18 ఏళ్ల లోపు వారిని ‘అడోలెసెంట్స్’ (Adolescents)గా పరిగణిస్తారు. వీరిని ‘ప్రమాదకరమైన పనుల్లో’ తప్ప ఇతర రంగాల్లో పని చేయించడానికి కొన్ని షరతులతో అనుమతి ఉంది. క్రీడలు, వినోద రంగం (సినిమాలు, టీవీ) వంటి వాటిని సాధారణంగా ప్రమాదకరమైనవిగా పరిగణించరు. బీసీసీఐ, ఐపీఎల్ నిబంధనల ప్రకారమే అతడిని వేలంలో చేర్చారు.
This language activist says,
He is going to file a case against Rajasthan Royals owners for using Vaibhav Suryavanshi as child labour 🤦♂️
A few words for him.. pic.twitter.com/6IFqYX6NdD
— Vije (@vijeshetty) May 2, 2026
ఈ వివాదం ఒకవైపు నడుస్తుంటే, వైభవ్ మాత్రం మైదానంలో తన బ్యాట్‌తోనే సమాధానం చెబుతున్నాడు. ఈ సీజన్లో ఇప్పటికే 350కి పైగా పరుగులు సాధించి పాయింట్ల పట్టికలో రాజస్థాన్‌ను టాప్ 4లో నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. పాకిస్థానీ నిపుణులు ఆయన బ్యాట్‌లో ‘ఏఐ చిప్’ ఉందని చేసిన వింత ఆరోపణలను కూడా ఆయన హాస్యంతో తిప్పికొట్టాడు. ప్రస్తుతానికి ఈ ‘చైల్డ్ లేబర్’ ఆరోపణలపై రాజస్థాన్ రాయల్స్ లేదా బీసీసీఐ అధికారికంగా స్పందించలేదు. ఒకవేళ ఫిర్యాదు నమోదైతే చట్టం ఏ విధంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
-
Nara Lokesh: విద్యార్థులను ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా..
-
US-Russia: యూఎన్ సమావేశాల ముందు రష్యాకు షాక్.. వీసా నిరాకరించిన అమెరికా
-
Chiranjeevi : అమెరికా అధ్యక్షుడికైనా 24 గంటలే! తన డైలీ రొటీన్, టైమ్ మేనేజ్మెంట్పై చిరు క్రేజీ కామెంట్స్
-
CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!