IPL 2026 టిక్కెట్లపై వివాదం.. బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్..!
- ఐపీఎల్ 2026 టికెట్లపై కర్ణాటకలో వివాదం
- కాంగ్రెస్ ఎమ్మెల్యే శివశంకరప్ప కేఎస్‌సీఏపై ఆరోపణలు
- ఉచిత టికెట్లు ఇవ్వకుండా బ్లాక్ మార్కెట్‌లో విక్రయం అంటూ విమర్శలు
- రూ.5,000 టికెట్‌ను రూ.35,000కి విక్రయిస్తున్నారన్న ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2026 Tickets: కర్ణాటకలో ఐపీఎల్ 2026 టికెట్ల వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కాశప్పనవర్ విజయానంద శివశంకరప్ప కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA)పై సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, వారి కుటుంబాలకు ఇవ్వాల్సిన ఉచిత టికెట్లను ఇవ్వకుండా బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారని ఆయన ఆరోపించారు. మార్చి 28న ప్రారంభమయ్యే ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో ఈ వివాదం తలెత్తింది. మీడియాతో మాట్లాడిన శివశంకరప్ప, “ప్రభుత్వం నుంచి అన్ని సౌకర్యాలు పొందుతున్న కేఎస్‌సీఏ, ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వడం లేదు. ఒక్క టికెట్ ధర రూ.5,000 ఉండగా, అదే టికెట్‌ను రూ.35,000కు బ్లాక్‌లో కొనాల్సి వస్తోంది” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
IPL 2026 Second Phase: ఐపీఎల్ సెకండ్ ఫేజ్ షెడ్యూల్ విడుదల.. ఆ లిస్ట్ ఇదే..
Also Read
- Heavy Rains: బీభత్సం సృష్టిస్తున్న భారీ వర్షాలు.. నీట మునిగిన వందల ఎకరాల వరి పంట!
- Yanamala Krishnudu: తుని రాజకీయాల్లో కీలక పరిణామం.. జనసేనలో చేరిన యనమల కృష్ణుడు!
- CJP Deepfake Case: PM మోదీతో మహిళ మార్ఫ్డ్ ఫొటోలు.. CJP నేతలకు హైకోర్టు నోటీసులు
- Trump-Jinping: ట్రంప్ విందుకు అందరూ వచ్చారు.. అసలైనోడే డుమ్మా కొట్టాడు.. ఎవరా ముఖ్యుడు!
ఇదిలా ఉండగా.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇప్పటికే ఐపీఎల్ 2026 పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ దశ మార్చి 28 నుంచి మే 24 వరకు జరుగనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద టీ20 లీగ్ అయిన ఐపీఎల్ 2026 19వ ఎడిషన్ ప్రారంభ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తలపడనుంది. మొదటి దశలో మొత్తం 20 మ్యాచ్ లు దేశంలోని 10 వేదికల్లో జరుగనున్నాయి. రెండో దశలో ఏప్రిల్ 13 నుంచి మే 24 వరకు 12 వేదికల్లో మొత్తం 50 మ్యాచ్లు జరగనున్నాయి. బెంగళూరు, ముంబై, గువాహటి, న్యూ చండీగఢ్, లక్నో, కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్ వంటి నగరాలు ఈ మ్యాచ్ లకు ఆతిథ్యం ఇస్తాయి. ఈ దశలో డబుల్ హెడ్డర్లు ఉండగా, మధ్యాహ్న మ్యాచ్‌లు 3:30 గంటలకు, సాయంత్రం మ్యాచ్‌లు 7:30 గంటలకు ప్రారంభమవుతాయి.
West Bengal Elections: మమతా బెనర్జీ ఇలాఖాలో బీజేపీ ‘‘శ్రీరామ నవమి’’ ర్యాలీ..
ప్రారంభ మ్యాచ్ తర్వాత ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ముంబైలోని వాంఖడే స్టేడియంలో తలపడనుంది. ఏప్రిల్ 4న తొలి డబుల్ హెడ్డర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్ జరగగా, అదే రోజు గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మరో మ్యాచ్ జరుగుతుంది. ఇక జట్ల హోం వేదికల విషయంలో కూడా మార్పులు ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ గువాహటిలో తమ హోం మ్యాచ్ లను ప్రారంభించనుండగా.. పంజాబ్ కింగ్స్ న్యూ చండీగఢ్, ధర్మశాలలో మ్యాచ్‌లు ఆడనుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ హోం మ్యాచ్‌లను బెంగళూరు, రాయపూర్ లలో ఆడనుంది.
తాజావార్తలు
-
TV Nandi Awards: తిరుపతి వేదికగా ‘నంది’ అవార్డుల వేడుక.. పరభాషా నటులపై ఆంక్షలు?
-
Heavy Rains: బీభత్సం సృష్టిస్తున్న భారీ వర్షాలు.. నీట మునిగిన వందల ఎకరాల వరి పంట!
-
Mamitha Baiju : మమితా బైజు కోరిక తీరేదెన్నడు?
-
Yanamala Krishnudu: తుని రాజకీయాల్లో కీలక పరిణామం.. జనసేనలో చేరిన యనమల కృష్ణుడు!
-
CJP Deepfake Case: PM మోదీతో మహిళ మార్ఫ్డ్ ఫొటోలు.. CJP నేతలకు హైకోర్టు నోటీసులు
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!