IPL 2026: ఐపీఎల్ 2026 ప్రారంభానికి ఇంకా మూడు నెలలకుపైగా సమయం ఉన్నప్పటికీ.. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ఇప్పటికే తమ సన్నాహాలను వేగవంతం చేసింది. ఇప్పటివరకు ఐపీఎల్‌లో తొలి టైటిల్‌ను అందుకోలేకపోయిన ఈ ఫ్రాంచైజీ ఆ లోటును తీర్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా జట్టు భారతీయ ఫాస్ట్ బౌలర్లను ఒక విదేశీ టీ20 లీగ్‌కు పంపేందుకు బీసీసీఐ నుంచి అనుమతి కూడా పొందింది.
IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్‌కు కొత్త కెప్టెన్..? అక్షర్ ను తప్పించనున్న మేనేజ్మెంట్..!
ఓ ప్రముఖ నివేదిక ప్రకారం.. ఐపీఎల్ 2026కి ముందు లక్నో సూపర్ జెయింట్స్ తమ దేశీయ పేసర్లను సౌతాఫ్రికాకు పంపే యోచనలో ఉంది. అక్కడ వారు SA20 లీగ్‌లో పాల్గొనే డర్బన్ సూపర్ జెయింట్స్‌తో కలిసి ట్రైనింగ్ పొందనున్నారు. డర్బన్ సూపర్ జెయింట్స్ అనేది LSGకి అనుబంధ జట్టుగా ఉంది. డిసెంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే SA20 లీగ్ సమయంలో ఈ బౌలర్లు అక్కడి ఆటగాళ్లతో కలిసి ప్రాక్టీస్ చేసి తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోనున్నారు. ప్రస్తుతం ఈ జాబితాలో ఆవేశ్ ఖాన్, మొహసిన్ ఖాన్ పేర్లు ఉన్నాయి. వీరితో పాటు యువ బౌలర్ నమన్తివారీ కూడా ఈ గ్రూప్‌లో చేరే అవకాశం ఉంది. ఈ బౌలర్లు వచ్చే వారం ఎప్పుడైనా డర్బన్‌కు బయల్దేరనున్నారు.
ఈ ఆటగాళ్లు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో లేరు.. అలాగే ప్రస్తుతం ఏ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించడం లేదు. అందుకే నిబంధనల ప్రకారం LSG ముందుగానే బీసీసీఐ అనుమతి తీసుకుంది. ఈ ప్రణాళిక ప్రధాన ఉద్దేశం.. చాలా కాలంగా గాయాలతో బాధపడుతున్న ఆటగాళ్లకు మ్యాచ్ ఫిట్‌నెస్ అందించడం. ముఖ్యంగా ఆవేశ్ ఖాన్, మొహసిన్ ఖాన్ గత కొంతకాలంగా గాయాల కారణంగా మైదానానికి దూరంగా ఉన్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆవేశ్ ఖాన్ గత ఐపీఎల్ తర్వాత ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అలాగే ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎడమచేతి పేసర్ మొహసిన్ ఖాన్ అయితే ఆ సీజన్‌లో కూడా ఆడలేకపోయాడు. కాబట్టి ఈ విదేశీ ట్రైనింగ్ వారి రీఎంట్రీకి కీలకంగా మారనుంది.
Krishnappa Gowtham Retirement: అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పిన ఐపీఎల్ సంచలనం..
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఆటగాళ్ల విషయానికి వస్తే.. ముందుగా రిటైన్ చేసిన ఆటగాళ్లలో రిషభ్ పంత్, మిచెల్ మార్ష్, ఎయిడన్ మార్క్రం, మయాంక్ యాదవ్, అబ్దుల్ సమద్, ఆయుష్ బడోని, మాథ్యూ బ్రీట్జ్కీ, హిమ్మత్ సింగ్, నికోలస్ పూరన్, షాబాజ్ అహ్మద్, అర్షిన్ కులకర్ణి, ఆవేశ్ ఖాన్, మొహసిన్ ఖాన్, ఎం. సిద్ధార్థ్, దిగ్వేష్ రాఠీ, ప్రిన్స్ యాదవ్, ఆకాష్ సింగ్, మహమ్మద్ షమీ, అర్జున్ టెండూల్కర్ (ట్రేడ్) ఉండగా.. కొత్తగా కొనుగోలు చేసిన ఆటగాళ్లలో వానిందు హసరంగా, ఎన్రిక్ నోర్కియా, ముకుల్ చౌధరి, అక్షత్ రఘువంశీ, నమన్తివారీ, జోష్ ఇంగ్లిస్ ఉన్నారు.