IPL 2025: రోహిత్ శర్మ చాలా కాస్ట్‌లీ గురూ.. అతడిని కొనడం మా వల్ల కాదు!
- ఐపీఎల్ 2025 వేలంలోకి రోహిత్
- హిట్‌మ్యాన్‌ను కొనుగోలు చేసేందుకు తీవ్ర పోటీ
- రికార్డులు పక్కా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjay Bangar on Rohit Sharma’s IPL 2025 Price; ముంబై ఇండియన్స్‌కు ఐదు టైటిల్స్ అందించిన రోహిత్ శర్మను ఐపీఎల్ 2024 సీజన్‌లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. గతేడాది హార్దిక్ పాండ్యా సారథ్యంలో హిట్‌మ్యాన్ ఆడాడు. కెప్టెన్సీ నుంచి తొలగించడంతో అసంతృప్తిగా ఉన్న రోహిత్.. ఐపీఎల్ 2025 ముందు వేరే ఫ్రాంచైజీకి వెళ్లిపోతాడనే కథనాలు సోషల్ మీడియాలో వచ్చాయి. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు హిట్‌మ్యాన్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని నెట్టింట న్యూస్ చక్కర్లు కొట్టాయి. తాజాగా మరో వార్త హల్‌చల్ చేస్తోంది.
ఐపీఎల్ 2025 మెగా వేలంలో రోహిత్ శర్మ తన పేరును నమోదు చేసుకుంటాడని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై పంజాబ్ కింగ్స్ డైరెక్టర్ సంజయ్ బంగర్ స్పందించారు. రోహిత్‌ను పంజాబ్ దక్కించుకుంటుందా? అని ఓ పాడ్‌కాస్టర్ అడగగా.. రోహిత్ చాలా కాస్ట్‌లీ గురూ, అతడిని కొనడం తమ వల్ల కాదని చెప్పకనే చెప్పారు. రోహిత్ మెగా వేలంలోకి వస్తే రికార్డులు సృష్టిస్తాడని, అత్యధిక ధరను సొంతం చేసుకుంటాడన్నారు. ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా మిచెల్ స్టార్క్ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. గతేడాది జరిగిన మినీ వేలంలో ఈ ఆస్ట్రేలియా ఆటగాడిని కేకేఆర్ ఏకంగా రూ.24.75కోట్లు పెట్టి దక్కించుకుంది.
Also Read
- Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
Also Read: Kia Seltos Price: కియా బంపర్ ఆఫర్.. సెల్టోస్‌పై 60 వేలు ఆదా!
పంజాబ్ కింగ్స్ డైరెక్టర్ సంజయ్ బంగర్ మాట్లాడుతూ… ‘రోహిత్ శర్మ ఐపీఎల్ 2025 మెగా వేలంలోకి వస్తే రికార్డులు సృష్టిస్తాడు. అత్యధిక ధరను అతడు సొంతం చేసుకుంటాడు. హిట్‌మ్యాన్ కోసం ప్రాంఛైజీలు ఎగబడడం ఖాయం అని అనుకుంటున్నా. అయితే మా పర్సులో సొమ్మును బట్టే రోహిత్‌ను పంజాబ్ కింగ్స్ దక్కించుకుంటుందా? లేదా? అనేది ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి హిట్‌మ్యాన్‌ను సొంతం చేసుకోవడం మాకు చాలా కష్టం’ అని అన్నారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
-
Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
-
LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!