భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో భాగంగా సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్.. 35 బంతుల్లో సెంచరీ చేశాడు. మొత్తంగా 38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సర్లతో 101 పరుగులు చేసి ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఈ ఒక్క సెంచరీతో వైభవ్ ఎన్నో రికార్డులు కొల్లగొట్టాడు. అవేంటో ఓసారి చూద్దాం.
Also Read: Vaibhav Suryavanshi: నాన్న ఉద్యోగం మానేశారు.. అమ్మకు మూడు గంటలే నిద్ర!
వైభవ్ సూర్యవంశీ రికార్డులు:
# ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత బ్యాటర్
# ఐపీఎల్‌లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడు
# ఐపీఎల్‌లో ఓ ఇన్నింగ్స్‌లో ఎక్కువ సిక్స్‌లు (11) కొట్టిన భారత బ్యాటర్ (మురళీ విజయ్‌తో సమానంగా)
# ఐపీఎల్‌లో హాఫ్ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడు (14 ఏళ్ల 32 రోజులు)
# ఐపీఎల్‌లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడు (14 ఏళ్ల 32 రోజులు)
# ఐపీఎల్ 2025లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (17 బంతుల్లో)
# ఐపీఎల్‌లో అతి పిన్న వయసులో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న ఆటగాడు
# టీ20 క్రికెట్ చరిత్రలో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడు (14 ఏళ్ల 32 రోజులు)