Rohit Sharma: నా దగ్గర బ్యాట్‌లు లేవు.. ఆరు దొబ్బేశారు! వీడియో వైరల్
- క్వాలిఫయర్ 2లో ముంబై ఇండియన్స్ ఓటమి
- ముంబై డ్రెసింగ్ రూంలో కామెడీ ఘటన
- రోహిత్ సమాధానంతో కర్ణ్ శర్మ నిరాశ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 2లో పంజాబ్ కింగ్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన క్వాలిఫయర్ 2లో ఓడిన ముంబై.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 203 రన్స్ చేసింది. సూర్యకుమార్ యాదవ్ (44), తిలక్ వర్మ (44)లు రాణించారు. పంజాబ్ 19 ఓవర్లలో 207 పరుగులు చేసి విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ (87), నెహాల్ వధేరా (48)లు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
క్వాలిఫయర్ 2 మ్యాచ్ అనంతరం మైదానంలో ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ కాస్త భావోద్వేగానికి గురయ్యారు. ఆపై డ్రెసింగ్ రూంలో కొన్ని కామెడీ సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ముంబై ప్లేయర్స్ చాలామంది తమ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ చుట్టూ చేరి ఆటోగ్రాఫ్‌లు అడిగారు. అందరికీ రోహిత్ టీషర్ట్, బ్యాట్‌లపై ఆటోగ్రాఫ్‌లు ఇచ్చాడు. స్పిన్నర్ కర్ణ్ శర్మ కూడా ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. ఆ సమయంలో తనకు ఓ బ్యాట్ ఇవ్వాలని హిట్‌మ్యాన్‌ను కర్ణ్ అడిగాడు. అందుకు రోహిత్ బదులిస్తూ.. ‘నా దగ్గర బ్యాట్స్ లేవు. ఇప్పటికే ఆరు బ్యాట్‌లు తీసుకున్నారు. బ్యాగ్ ఖాలీ అయిపోయింది చూడు’ అని అన్నాడు. రోహిత్ సమాధానంతో కర్ణ్ కాస్త నిరాశ చెందాడు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది.
Also Read
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
Also Read: Virat Kohli: మూడు ఫైనల్స్ ఆడిన ఆర్సీబీ.. విరాట్ కోహ్లీ ఎన్ని రన్స్ చేశాడో తెలుసా?
రోహిత్ శర్మ కిట్ బ్యాగ్‌లో మొత్తం 9 బ్యాట్‌లు ఉండగా.. ముంబై ప్లేయర్స్ 6 తీసుకున్నారు. ఇక బ్యాగ్‌లో మూడే బ్యాట్‌లు ఉన్నాయి. రాబిన్ మింజ్, అశ్వని కుమార్, జానీ బెయిర్‌స్టో, కృష్ణన్ శ్రీజిత్ సహా మరో ఇద్దరు హిట్‌మ్యాన్ బ్యాట్‌లను తీసుకున్నారు. ఇక ఈ సీజన్లో రోహిత్ శర్మ పెద్దగా ప్రభావం చూపలేదు. 46.9 సగటు,152.2 స్ట్రైక్ రేట్‌తో 328 పరుగులు చేశాడు. చాలా మ్యాచులలో ఇంపాక్ట్ సబ్‌గా బరిలోకి దిగాడు.
Rohit Sharma gave 6 bats to other MI players and he didn’t have anymore to distribute. 🤣pic.twitter.com/6mXcCZlg1T
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 2, 2025
తాజావార్తలు
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!