Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Ipl 2025 Retention Kl Rahul To Released By Lsg Ahead Of Ipl 2025

KL Rahul-IPL 2025: పాపం కేఎల్‌ రాహుల్‌.. లక్నో రిటైన్ లిస్ట్‌ ఇదే!

Published Date :October 23, 2024 , 1:17 pm
By Sampath Kumar
  • ఐపీఎల్‌ 2025 ముందు మెగా వేలం
  • అక్టోబర్ 31 తుది గడువు
  • లక్నో రిటైన్ లిస్ట్‌ ఇదే
KL Rahul-IPL 2025: పాపం కేఎల్‌ రాహుల్‌.. లక్నో రిటైన్ లిస్ట్‌ ఇదే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఐపీఎల్‌ 2025 ముందు మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. వేలానికి సంబంధించి రిటెన్ష‌న్ రూల్స్‌ను ఇటీవల బీసీసీఐ ప్ర‌క‌టించింది. ఈసారి ఆరుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు ప్రాంచైజీలకు అవకాశం ఇచ్చింది. ప్రాంచైజీలు తమ రిటెన్షన్‌ లిస్ట్‌ సమర్పించేందుకు అక్టోబర్ 31 తుది గడువు. ఈ నేపథ్యంలో ఏ జట్టు ఎవరెవరిని రిటైన్ చేసుకుంటుంది?, ఎవరిని వదిలేస్తుంది? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే లక్నో సూపర్ జెయింట్స్‌ (ఎల్‌ఎస్‌జీ) తన కెప్టెన్‌ను వదిలేసేందుకు సిద్దమైందట.

ఐపీఎల్ 2024 సీజన్‌లో లక్నో దారుణమైన ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. లీగ్ దశలో హైదరాబాద్ మ్యాచ్ సందర్భంగా కెప్టెన్ కేఎల్‌ రాహుల్‌పై ఎల్‌ఎస్‌జీ ఓనర్ సంజీవ్‌ గోయెంకా అసహనం వ్యక్తం చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ తర్వాత గోయెంకా అందుకు వివరణ ఇచ్చారు. ఆ మధ్య గోయెంకా, రాహుల్ కలిశారు కూడా. దాంతో అందరూ ఎల్‌ఎస్‌జీలోనే రాహుల్ ఉంటాడనుకున్నారు. తాజాగా ఎల్‌ఎస్‌జీ మెంటార్‌గా వచ్చిన టీమిండియా మాజీ పేసర్ జహీర్‌ ఖాన్‌.. ఓ నివేదికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. లక్నో రిటైన్ లిస్ట్‌లో రాహుల్ లేడట. అతడు మెగా వేలంలోకి వస్తాడని సమాచారం.

Also Read

  • Lenin : రామ్ చరణ్ ‘పెద్ది’ దెబ్బతో మళ్లీ సైలెంట్ అయిన ‘లెనిన్’ !
  • Janasena Party: కర్ణాటకలో జనసేన విస్తరణకు శ్రీకారం.. పార్టీలో భారీగా చేరికలు
  • Aditya Dhar: మరోసారి ‘ధురంధర్’ కాంబో రిపీట్ ..
  • Gayatri Gupta: ‘పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది’.. శివాజీపై గాయత్రి గుప్తా ఫైర్..

‘ఐపీఎల్ 2024లో జట్టు ప్రదర్శనపై ఎల్‌ఎస్‌జీ మేనేజ్‌మెంట్, మెంటార్ జహీర్ ఖాన్, కోచ్ జస్టిన్‌ లాంగర్ ప్రత్యేకంగా ఓ నివేదిక సిద్ధం చేశారు. గత సీజన్‌లో కేఎల్ రాహుల్ నాయకత్వంలో ప్లే ఆఫ్స్ చేరుకోవడంలో టీమ్ విఫలమైంది. బ్యాటర్‌గా జట్టు పరాజయాల్లో రాహుల్ పాత్ర ఉందని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. మిడిల్‌ ఓవర్లలో చాలా నెమ్మదిగా ఆడి భారీ స్కోరుకు అడ్డుగా మారాడు. అందుకే అతడిని పక్కన పెట్టేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయ్. ఇంపాక్ట్‌ రూల్‌తో మిగతా జట్లు భారీ స్కోర్లు చేస్తుంటే.. లక్నో మాత్రం వెనకబడిపోయింది. టాప్‌ ఆర్డర్‌లో ఎక్కువ బంతులు వృథా చేయడంతో మిగతా బ్యాటర్లపై ప్రభావం పడింది’ అని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి. గత సీజన్‌లో రాహుల్ 14 మ్యాచుల్లో 520 పరుగులు చేశాడు. కానీ.. స్ట్రైక్‌రేట్‌ 136గా ఉంది.

Also Read: Chain Snatching: దారుణం.. చైన్‌ కోసం మహిళను రోడ్డుపై ఈడ్చుకెళ్లిన దొంగలు! (వీడియో)

జహీర్ ఖాన్ సిద్ధం చేసిన రిటైన్ లిస్ట్‌లో యువ ఆటగాళ్లకు అవకాశం దక్కనుందని తెలుస్తోంది. పేసర్ మయాంక్‌ యాదవ్‌ను ఎల్‌ఎస్‌జీ తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. గత సీజన్‌లో రాణించిన ఆయుష్ బదోని, మోసిన్‌ ఖాన్‌ను రిటైన్ చేసుకోనుందట. వీరిద్దరూ అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్లు కొనసాగే అవకాశం ఉంది. విండీస్ హిట్టర్ నికోలస్‌ పూరన్‌ను రిటైన్ చేసుకొని.. కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని సమాచారం. దీపక్ హుడా, దేవదత్ పడిక్కల్, డికాక్, స్టోయినిస్, కైల్ మేయర్స్, హేన్రి, నవీన్, మిశ్రాలు ఎల్‌ఎస్‌జీలో ఉన్నారు. వీరిలో ఎవరికీ అవకాశం దక్కుతుందో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • IPL 2025
  • IPL Auction 2025
  • KL Rahul
  • LSG Retain List
  • zaheer khan

తాజావార్తలు

  • Riyan Parag: వరుస వివాదాల్లో రాజస్థాన్ రాయల్స్.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ కెప్టెన్..

  • Lenin : రామ్ చరణ్ ‘పెద్ది’ దెబ్బతో మళ్లీ సైలెంట్ అయిన ‘లెనిన్’ !

  • Bajaj Chetak C2501 STD: బజాజ్ చేతక్ సిరీస్‌లో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, ఫీచర్లు & స్పెసిఫికేషన్స్

  • Janasena Party: కర్ణాటకలో జనసేన విస్తరణకు శ్రీకారం.. పార్టీలో భారీగా చేరికలు

  • Bank Holiday May 2026: మే నెలలో భారీగా బ్యాంకు సెలవులు.. మొత్తం ఎన్నిరోజులంటే?

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions