ఐపీఎల్ 2025 ముందు మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. వేలానికి సంబంధించి రిటెన్షన్ రూల్స్‌ను ఇటీవల బీసీసీఐ ప్రకటించింది. ఈసారి ఆరుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు ప్రాంచైజీలకు అవకాశం ఇచ్చింది. ప్రాంచైజీలు తమ రిటెన్షన్ లిస్ట్ సమర్పించేందుకు అక్టోబర్ 31 తుది గడువు. ఈ నేపథ్యంలో ఏ జట్టు ఎవరెవరిని రిటైన్ చేసుకుంటుంది?, ఎవరిని వదిలేస్తుంది? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) తన కెప్టెన్‌ను వదిలేసేందుకు సిద్దమైందట. ఐపీఎల్ 2024…