ఐపీఎల్ 2025లో భాగంగా గురువారం చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఓటమి చవిచూసింది. ఆర్‌సీబీ నిర్ధేశించిన 164 పరుగుల లక్ష్యాన్ని డీసీ 4 వికెట్లు కోల్పోయి 17.5 ఓవర్లలోనే ఛేదించింది. ‘లోకల్ బాయ్’ కేఎల్ రాహుల్ (93 నాటౌట్; 53 బంతుల్లో 7×4, 6×6) బెంగళూరు పతనాన్ని శాసించాడు. 5 పరుగుల వద్ద రాహుల్ క్యాచ్‌ను కెప్టెన్ పాటీదార్ వదిలేయడంతో ఆర్‌సీబీ భారీ మూల్యం చెల్లించుకుంది. మొదట…