ఐపీఎల్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ తలో జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇండియాకు ఆడుతున్నప్పుడు ఒకరికొకరు సపోర్ట్ చేసుకునే ఈ బ్యాటర్లు.. ఐపీఎల్ మాత్రం నువ్వా నేనా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన ఢిల్లీ, ఆర్సీబీ మ్యాచ్‌లో డీసీ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రాహుల్ 93 పరుగులతో ఊచకోత కోశాడు. 53 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో ఆర్సీబీపై దండయాత్ర చేశాడు. అయితే కోహ్లీ మాత్రం కేవలం 22 పరుగులకే ఇన్నింగ్స్ ముగించాడు. సొంతగడ్డపై ఓటమి బాధలో ఉన్న ఆర్సీబీకి రాహుల్ ఊరమాస్ లెవెల్‌లో వార్నింగ్ ఇచ్చాడు. నేను కూడా ఇదే గడ్డపై పుట్టాన్రా అన్న లెవెల్‌లో సెలెబ్రేషన్స్ చేసుకున్నాడు. రాహుల్ చేసిన సెలెబ్రేషన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
పిచ్ కీలకంగా మారిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తెలివిగా బౌలింగ్ ఎంచుకుంది. మైదానం చిన్నది కావడం, మ్యాచ్ సాగుతున్నా కొద్దీ డ్యూ వచ్చే అవకాశం ఉండటంతో.. ఢిల్లీ బౌలింగ్‌కే మొగ్గు చూపింది. పిచ్ అప్రోచ్‌ను ఆర్సీబీ అంచనా వేయకపోవడం కూడా ఓటమికి కారణమైంది. ఛేదనలో కేఎల్ రాహుల్ పిచ్ పరిస్థిని పూర్తిగా అర్ధం చేసుకుని స్లో గా బ్యాటింగ్ ప్రారంభించాడు. చివర్లో తనదైన దూకుడుతో ఆర్సీబీ బౌలర్లను ఉతికారేశాడు. రాహుల్ విధ్వంసానికి ఆర్సీబీ బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. ఇక ఆదివారం ఇరు జట్లు మరోసారి తలపడనున్నాయి. గత మ్యాచ్ ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఆర్సీబీ సిద్ధమైంది. ఈ మ్యాచ్ కోహ్లీ సొంత గడ్డపై జరగనుంది. ఢిల్లీలోని అర్జు జైట్లీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.
ఢిల్లీ క్యాపిటల్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉంది. అక్షర్ పటేల్ నేతృత్వంలోని ఢిల్లీ జట్టు ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 2 ఓటములతో 12 పాయింట్లను కలిగి ఉంది. మరోవైపు ఆర్సీబీ 9 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 3 ఓటములతో 12 పాయింట్లతో మూడవ స్థానంలో ఉంది. నేడు గెలిచిన టీమ్ ప్లేఆఫ్స్‌కు మరింత చెరువవుతుంది. రెండు టీమ్స్ మంచి ఫామ్ మీదుండడంతో రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తోంది. రెండు జట్లు తుది జట్టులో మార్పులు చేసే అవకాశాలు తక్కువ.
Also Read: Sourav Ganguly-PCB: రంగంలోకి సౌరవ్ గంగూలీ.. ఇక పీసీబీ అడుక్కు తినాల్సిందే!
తుది జట్లు (అంచనా):
ఢిల్లీ: అభిషేక్ పొరెల్, ఫాఫ్ డుప్లెసిస్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ (కెప్టెన్), అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, స్టార్క్, కుల్దీప్, ముకేశ్ కుమార్, చమీరా.
బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, పడిక్కల్, రజత్ పాటీదార్ (కెప్టెన్), జితేశ్ శర్మ, షెఫర్డ్, టీమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్, హాజల్‌వుడ్, యశ్ దయాళ్, సుయాశ్ శర్మ.