Rohit Sharma Talks About Sarfaraz Khan’s Father Naushad Khan: తాను చిన్నతనంలో ‘కంగా’ లీగ్‌లో టీమిండియా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషాద్ ఖాన్‌తో కలిసి ఆడానని భారత కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు.ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో అరంగేట్ర కుర్రాళ్లలో కలిసి ఆడడాన్ని తాను ఎంతో ఆస్వాదించానని తెలిపాడు. కుర్రాళ్ల అరంగేట్రం భావోద్వేగాన్ని కలిగించిందని, వారి ప్రదర్శనలను చూసి తాను ఆనందించాను అని రోహిత్ చెప్పాడు. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, ఆకాశ్ దీప్, దేవ్‌దత్ పడిక్కల్ అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.
బుధవారం ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ‘టీమ్ రో’లో రోహిత్ శర్మ మాట్లాడుతూ… ‘ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో వ్యక్తిగతంగా నేను కుర్రాళ్లతో కలిసి ఆడడాన్ని చాలా ఆస్వాదించా. వారంతా చాలా అల్లరి చేసేవారు. వాళ్లలో చాలా మంది నాకు బాగా తెలుసు. వారి బలాలు, వాళ్లు ఎలా ఆడాలనుకుంటారో నాకు తెలుసు. వాళ్లు ఎంత మంచి ఆటగాళ్లో చెప్పడం, గతంలో ఎంత బాగా రాణించారో చెప్పడం ద్వారా వారిని ప్రోత్సహించడం నా బాధ్యత. వారి ప్రదర్శనలను చూసి ఆనందించా’ అని తెలిపాడు.
Also Read: Glenn Maxwell-Virat Kohli: కోహ్లీని ఇమిటేట్ చేసిన మాక్స్‌వెల్.. వీడియో వైరల్!
‘ఈ అరంగేట్ర కుర్రాళ్లతో ఆడుతూ నేను మైమరిచిపోయా. వాళ్ల తల్లిదండ్రులూ మైదానంలోనే ఉన్నారు. అది ఎంతో భావోద్వేగం. ఆ కుర్రాళ్ల అరంగేట్రాన్ని చూడడం ఎంతో సంతోషాన్నిచ్చింది. నేను కుర్రాడిగా ఉన్నప్పుడు కంగా లీగ్‌లో సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషాద్ ఖాన్‌తో కలిసి ఆడా. నౌషాద్ ఎడమచేతి వాటం బ్యాటర్. దూకుడుగా ఆడుతూ ముంబై క్రికెట్ సర్కిల్‌లలో బాగా పేరు తెచ్చుకున్నారు. సర్ఫరాజ్ భారతదేశం తరఫున ఆడటం ద్వారా నౌషాద్ చాలా సంతోషించారు. కుమారుడి టెస్టు క్యాప్ నౌషాద్దే అన్నట్టు’ అని రోహిత్ పేర్కొన్నాడు.