చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘వన్‌ప్లస్’ తన వన్‌ప్లస్ 15 ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా భారతదేశంలో లాంచ్ చేసింది. వన్‌ప్లస్ 15 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.72,999గా ఉంది. డిస్కౌంట్ తర్వాత రూ. 68,999కి మీకు లభిస్తుంది. వన్‌ప్లస్ 15 ధర ‘యాపిల్’ ఐఫోన్ 17 ధరకు చాలా దగ్గరగా ఉంది. ఐఫోన్ 17 (256జీబీ) ప్రారంభ ధర రూ.82,900. బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్ల తర్వాత మీరు ఐఫోన్‌ను రూ.76,000 వరకు కొనుగోలు చేయవచ్చు. రెండు ఫోన్ల ధరలు కాస్త అటుఇటుగా ఉన్నాయి. మరి రెండిటిలో ఏది కొంటే బెటరో ఇప్పుడు చూద్దాం.
వన్‌ప్లస్ 15, ఐఫోన్ 17 ఫోన్ల మధ్య ధర వ్యత్యాసం 10 వేల కంటే తక్కువ. మీరు ఈ రెండు ఫోన్లలో ఒకదానిని ఎంచుకునే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. వన్‌ప్లస్ 15 ఫోన్ 6.78-అంగుళాల QHD+ AMOLED డిస్ప్లేను కలిగి ఉండగా.. iPhone 17 6.3-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్ప్లేను కలిగి ఉంది. వన్‌ప్లస్ ఫోన్ 7300mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్ సహా 50W వైర్లెస్ ఛార్జింగ్‌తో వస్తుంది. యాపిల్ తన ఫోన్లకు బ్యాటరీ లైఫ్ ఇన్ఫోను వెల్లడించదు. కంపెనీ ప్రకారం.. ఐఫోన్ 17 30 గంటల వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. ఈ ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్, వైర్లెస్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది.
రెండు ఫోన్ల ప్రాసెసర్ల గురించి మాట్లాడుకుంటే.. వన్‌ప్లస్ 15లో క్వాల్కామ్ అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్ Snapdragon 8 Elite Gen 5 ఉంది. iPhone 17లో A19 బయోనిక్ ప్రాసెసర్ ఉంటుంది. వన్‌ప్లస్ 15 Androidతో రాగా.. ఐఫోన్ 17 iOSతో రన్ అవుతుంది . వన్‌ప్లస్ 15లో 50MP + 50MP + 50MP ట్రిపుల్ రియర్ కెమెరా అండ్ 32MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఐఫోన్ 17 లో 48MP + 48MP డ్యూయల్ రియర్ కెమెరా అండ్ 18MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. రెండు ఫోన్లు AI ఫీచర్లతో వస్తాయి. వన్‌ప్లస్ 15లో గూగుల్ యొక్క జెమిని AI ఉండగా.. ఐఫోన్ 17లో యాపిల్ ఇంటెలిజెన్స్ ఉంది.
Also Read: Temba Bavuma: 148 ఏళ్ల చరిత్రలోనే ‘ఒకే ఒక్కడు’ టెంబా బవుమా!
వన్‌ప్లస్ 15, ఐఫోన్ 17 ఫోన్లు ఫ్లాగ్షిప్ స్పెసిఫికేషన్లతో వస్తాయి. శక్తివంతమైన ఫీచర్లను అందిస్తాయి. వేర్వేరు ఆపరేటింగ్ సిస్టమ్‌లను ఉంటాయి కాబట్టి.. మీరు Android లేదా iOSలలో ఏది ఇష్టపడతారో నిర్ణయించుకోవాలి. ఐఫోన్ 17 స్టైలిష్ డిజైన్, మెరుగైన కెమెరా పనితీరు సహా డేటా గోప్యత ఉంటుంది. ఐఫోన్ స్మార్ట్ఫోన్లు దీర్ఘకాలిక ఉపయోగం కోసం మంచి ఆప్షన్. వన్‌ప్లస్ 15 మెరుగైన బ్యాటరీ లైఫ్, వేగవంతమైన ఛార్జింగ్, మెరుగైన కెమెరాను అందిస్తుంది. ఐఫోన్ మెరుగైన ఫోన్, మంచి రీసేల్ వాల్యూ కూడా ఉంటుంది.