అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి రావాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం అందింది. బుధవారం మధ్యాహ్నం పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌కు ఆర్‌ఎస్‌ఎస్ ప్రాంత సంపర్క ప్రముఖ్ ముళ్లపూడి జగన్ ఆహ్వాన పత్రిక అందించారు.
UP: అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి అంతా సిద్ధమవుతోంది. యూపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు, కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపడుతుంది. ఇక ఆలయాన్ని అన్ని హంగులతో ముస్తాబవోతోంది. దేశ నలుమూలల నుంచే కాదు విదేశీయులు సైతం ఈ రామమందిర ప్రారంభోత్సవానికి హాజరకానున్నారు. ఈ నేపథ్యంలో యోగి ఆదిథ్యనాథ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు, వీధులు పరిశుభ్రత కార్యక్రమాలను చేపట్టింది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య నాలుగు రోజులు అక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.…