ప్రస్తుతం యంగ్ హీరోలు వారి ఐడియాలజీ మార్చుకుని మంచి మంచి కాన్‌సెప్ట్‌లు ఎంచుకుంటున్నారు. ఇక రౌడి హీరో విజయ్ దేవరకొండ అయితే ముందు నుండి కూడా దీనే ఫాలో అవుతున్నాడు. అందుకే ఆయన సినీ ప్రయాణం గురించి పొరుగు భాషలు సైతం ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో స్పై థ్రిల్లర్ చిత్రం “కింగ్డమ్” చేస్తున్నాడు విజయ్. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమా తర్వాత ఆయన చేయనున్న రెండు సినిమాలు ఇప్పటికే ఖరారయ్యాయి. రవికిరణ్ కోలా దర్శకత్వంలో గ్రావిూణ నేపథ్యంలో సాగే ఓ యాక్షన్ డ్రామా కథలో నటించనున్నారు విజయ్. దీనికి దిల్‌రాజు నిర్మాత.. దీంతోపాటు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో రాహుల్ సంకృత్యాన్ దర్శకుడిగా ఓ సినిమా చేయనున్నారు.
Also Read : The Paradise: నాని కోసం రంగంలోకి మరో సంస్థ ?
రాయలసీమ నేపథ్యంలో సాగే పీరియాడిక్ కథతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఆల్రెడీ వీరిద్దరి కాంబోలో ‘టాక్సీవాలా’ చేసిన, ఈ కాంబినేషన్ ఇప్పుడు మరో సినిమా చేసేందుకు సిద్ధం అయ్యారు. ఇక ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొనగా తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కన్ఫర్మ్ అయ్యింది. దర్శకుడు అలాగే నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నుంచి లేటెస్ట్ హింట్స్ తో ఇది కన్ఫర్మ్ అయితే చేశారు. ఇక అధికారిక ప్రకటన ఒక్కటే బాకీ అని చెప్పాలి. ఇక మొత్తనికి ఓ స్పై థ్రిల్లర్, ఓ పీరియాడిక్ కథ, గ్రావిూణ నేపథ్యంలో సాగే మరో చిత్రం ఇలా విభిన్నమైన కథలతో సరికొత్త ప్రయాణం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు విజయ్ దేవరకొండ.
— Mythri Movie Makers (@MythriOfficial) May 2, 2025