ఇంటర్ చదువుతున్న మైనర్ బాలికపై పెట్రోల్‌పోసి నిప్పు పెట్టి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన వైఎస్‌ఆర్ కడప జిల్లా బద్వేల్‌లో చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. బద్వేల్ పట్టణంలో ప్రేమ పేరుతో యువకుడి చేతిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది.
కడప జిల్లా బద్వేల్ సమీపంలో ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ దాడి ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఇంటర్ విద్యార్థినిని రోడ్డుపక్కనే చెట్లలోకి తీసుకెళ్లి విఘ్నేష్ అనే యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ కేసులో పోలీసులు బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు.
కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బద్వేలు సమీపంలో ఇంటర్ విద్యార్థినిపై పెట్లోల్ దాడి ఘటన కలకలం రేపింది. ఇంటర్ విద్యార్థినిని రోడ్డు పక్కనే చెట్లలోకి తీసుకెళ్లి ఓ యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని స్థానికులు కడప రిమ్స్‌కు తరలించారు.