కడప ఘటనపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ x వేదికగా స్పందించారు. 'లా అండ్ ఆర్డర్‌ను కాపాడలేకపోతున్నారు.. ఇదేమి రాజ్యం @ncbn గారూ? మహిళలకు, బాలికలకు రక్షణ కూడా ఇవ్వలేకపోతున్నారు… ఇదేమి రాజ్యం? ప్రతిరోజూ ఏదో చోట హత్యాచారాలు, హత్యలు, వేధింపులు సర్వసాధారణమైపోయాయి. బద్వేలులో కాలేజీ విద్యార్థినిపై పెట్రోలుపోసి, నిప్పుపెట్టి ప్రాణాలు తీసిన ఘటన అత్యంత హేయం, దుర్మార్గం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ ఘటన వెనుక రాష్ట్ర ప్రభుత్వం,…
కడప జిల్లా బద్వేల్‌లో యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో తీవ్రంగా గాయడిన ఇంటర్ విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధాకరమని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన ఎంతగానో కలచివేసిందన్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థిని ఒక దుర్మార్గుడి దుశ్చర్యకు బలి కావడం విచారకరమని దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
కడప జిల్లాలో పెట్రోల్ దాడికి గురైన విద్యార్థిని మరణం విషాదకరమని హోం మంత్రి వంగలపూడి అనిత విచారం వ్యక్తం చేశారు. తీవ్రంగా గాయపడి కోలుకోలేక ఆస్పత్రిలో మృతి చెందడం చాలా దిగ్భ్రాంతికరమన్నారు. బాలికపై దాడి అనంతర దృశ్యాలు, పరిస్థితులు తనను తీవ్రంగా కలచివేశాయన్నారు.
ఇంటర్ చదువుతున్న మైనర్ బాలికపై పెట్రోల్‌పోసి నిప్పు పెట్టి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన వైఎస్‌ఆర్ కడప జిల్లా బద్వేల్‌లో చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. బద్వేల్ పట్టణంలో ప్రేమ పేరుతో యువకుడి చేతిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది.