Fake notes: ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ నోట్ల దందా.. ఎన్ని లక్షలు ప్రింట్ చేశారంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake notes: ఇప్పటి వరకు సోషల్ మీడియాను టైం పాస్ వాడినోళ్లను మనం చూసి ఉంటాం.. కానీ వీళ్లు మాత్రం ఒక అడుగు ముందుకేసి నకిలీ నోట్ల దందాకు వాడేస్తున్నారు. అరేయ్ ఎవర్రా మీరంతా అనే ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ జిల్లాలో వెలుగుచూసింది. అక్కడి స్థానిక పోలీసులు నిందితులను గుర్తించి ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.2.59 లక్షల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీనితో పాటు 6 ఫోన్లు, 2 ల్యాప్‌టాప్‌లు, 1 కలర్ ప్రింటర్, ఫోటో కట్టర్, 20 ఖాళీ సెక్యూరిటీ థ్రెడ్ పేపర్లు, 52 షీట్‌లపై తయారు చేసిన నోట్లు, 6 ఆధార్ కార్డులను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.
READ ALSO: Cheapest Phones: దేశంలోనే అత్యంత చౌకైన ఫోన్లు ఇవే!.. ధర రూ. వెయ్యి కన్నా తక్కువే..
Also Read
నిజమైన రూ.250కి .. నకిలీ రూ.500
సహరన్‌పూర్ సిటీ ఎస్పీ వ్యోమ్ బిందాల్ మాట్లాడుతూ.. సహరన్‌పూర్‌లోని కుతుబ్‌షేర్ పోలీసులు, స్వాట్ నిఘా బృందం రెండు రోజుల క్రితం రూ.2.59 లక్షల విలువైన నకిలీ కరెన్సీతో రుబల్, వాన్ష్ అనే ఇద్దరు యువకులను అరెస్టు చేసింది. వారిని విచారించిన తర్వాత మరికొందరి పేర్లు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. వాటి ఆధారంగా పోలీసులు జిల్లా పరిధిలోని లోకో పైలట్ శిక్షణా కేంద్రం ముందు ఉన్న ఖాళీ క్వార్టర్స్‌పై దాడి చేశారని పేర్కొన్నారు. దాడిలో కాన్పూర్‌కు చెందిన శశి అలియాస్ సర్వేష్, గోరఖ్‌పూర్‌కు చెందిన నవీన్ పాశ్వాన్, హర్యానాకు చెందిన కర్ణ్‌వీర్ అనే ముగ్గురిని అరెస్టు చేశారని తెలిపారు. నిందితులు రూ.250 చెల్లిస్తే నకిలీ రూ.500 నోట్లు ఇచ్చేవారని, వీరు ఈ దందాను ఇన్‌స్టాగ్రామ్ ఆధారంగా చేస్తున్నారని పేర్కొన్నారు. ముందుగా అరెస్ట్ చేసిన రూబల్, వాన్ష్‌లను విచారించినప్పుడు, వారిద్దరూ తర్వాత అరెస్ట్ చేసిన నిందితుల నుంచి నోట్లు కొనుగోలు చేసి సరఫరా చేసేవారని తేలిందన్నారు. ఈ ముఠా విదేశీ ఆన్‌లైన్ యాప్‌ల నుంచి సెక్యూరిటీ పేపర్‌లను కొనుగోలు చేసి నకిలీ కరెన్సీని తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియా యూజర్స్ వీళ్ల టార్గెట్ అని పేర్కొన్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థకు హాని చేస్తున్నారు..
నిందితులు నకిలీ నోట్లను అమ్మడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు హాని కలిగిస్తున్నారని ఎస్పీ చెప్పారు. నిందితుల మొత్తం నెట్‌వర్క్‌ను దర్యాప్తు చేస్తున్నామని, నెట్‌వర్క్‌లో ఇంకా ఎంత మంది ఉన్నారనే దానిపై సమాచారం సేకరిస్తున్నట్లు తెలిపారు. కొందరు కేవలం వారి స్వార్థం కోసం మోసాలతో నిండిన సోషల్ మీడియా ప్రకటనలు జారీ చేస్తున్నారని, అలాంటి ప్రలోభాలతో కూడిన ప్రకటలను ప్రజలు వెంటనే నమ్మవద్దని సూచించారు. ఎవరైనా మీమల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని భావిస్తే వెంటనే దాని గురించి స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు.
READ ALSO: Number of madrasas in Pakistan: పాక్‌లో ఫ్యాక్టరీల కంటే మసీదులు, మదర్సాలే ఎక్కువ..
తాజావార్తలు
-
NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
-
Antera Closed: ఎన్టీవీ ఎఫెక్ట్.. చివరకు మూతపడిన ‘అంతేరా’.!
-
Explainer: సూపర్ ఎల్‌నినో కాటు.. 2.3లక్షల మంది బలి?
-
AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
-
Khairatabad Bypoll: ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక.. గెజిట్ విడుదల.!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!