The RajaSaab : బాబోయ్.. భారీ ధర పలుకుతున్న రాజాసాబ్ నాన్ థియేట్రికల్ రైట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా రాజాసాబ్. కల్కి తర్వాత ప్రభాస్ చేస్తున్న మోస్ట్ ఎంటర్టైనింగ్ మూవీ ఇది. మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఫైట్స్, కామెడీ, డ్యాన్స్‌తో పాటు ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నాడు డార్లింగ్. పైగా ఫస్ట్ హార్రర్ రొమాంటిక్ కామెడీ మూవీ చేస్తున్నాడు. అందులోను ప్రభాస్ ఓల్డ్ లుక్‌లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే రివీల్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. వింటేజ్ ప్రభాస్ కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయించాడు .
ఇదిలా ఉండగా ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత భారీ బడ్జెట్ పై నిర్మిస్తోంది. అయితే రిలీజ్ కు ముందే నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే రాజాసాబ్ భారీ రిటర్న్స్ రాబట్టనున్నాడు. అందిన సమాచారం మేరకు రాజాసాబ్ నాన్ థియేట్రికల్ రైట్స్ రూ. 180 నుండి 210 కోట్ల మేరకు రావచ్చట. హిందీ కాకుండానే ఈ ఫిగర్ ఉండొచ్చు అని సమాచారం. ఇక థియేట్రీకల్ రైట్స్ ను చెప్పక్కర్లేదు. నైజాం వంటి ఏరియాలు వంద కోట్ల మేర పలికే అవకాశం ఉంది. నార్త్ రైట్స్ కూడా భారీగా ఉండబోతున్నాయి. ఈ సినిమాకు ఈ స్థాయిలో డిమాండ్ ఉందంటే రెండు మాట లేకుండా డార్లింగ్ కారణమనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది. ప్రభాస్ పై సాంగ్స్ షూట్ చేస్తున్నారు. యంగ్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ఈ ఏడాది డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో దిగుతోంది.
Also Read
- Venkatesh: "20 ఏళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో .. పెళ్లికాని ప్రసాద్ కాలం పోయింది"
- Trivikram Srinivas: 'ఆయన అంటే గౌరవంతో కూడిన ఇష్టంతో వచ్చిన భయం' వెంకీ మామపై త్రివిక్రమ్ వైరల్ కామెంట్స్!
- Karthi: "డీఎంకే అయినా.. టీవీకే అయినా ఇంతేనా?" విజయ్ సర్కార్‌ను నిలదీసిన హీరో కార్తి!
- Srikanth Odela: ‘నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌వి బిడ్డా’.. ‘పారడైజ్’ వివాదాస్పద సీన్‌పై శ్రీకాంత్ ఓదెల ఓపెన్ క్లారిటీ!
తాజావార్తలు
-
Venkatesh: “20 ఏళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో .. పెళ్లికాని ప్రసాద్ కాలం పోయింది”
-
Trivikram Srinivas: ‘ఆయన అంటే గౌరవంతో కూడిన ఇష్టంతో వచ్చిన భయం’ వెంకీ మామపై త్రివిక్రమ్ వైరల్ కామెంట్స్!
-
LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
-
Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
-
Karthi: “డీఎంకే అయినా.. టీవీకే అయినా ఇంతేనా?” విజయ్ సర్కార్‌ను నిలదీసిన హీరో కార్తి!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?