Infinix Smart 10: బడ్జెట్ సెగ్మెంట్‌లో ఇన్‌ఫినిక్స్ మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 10 పేరుతో విడుదలైన ఈ కొత్త ఫోన్, గత మోడల్ స్మార్ట్ 9 HD కు అప్డేటెడ్ వర్షన్ గా భారత్‌లో అధికారికంగా లాంచ్ చేసింది. ఆకర్షణీయమైన ధరలో ప్రీమియమ్ ఫీచర్లను అందించడమే లక్ష్యంగా దీని లాంచ్ చేశారు. మరి ఈ బడ్జెట్ ఫోన్ సంబంధించిన పూర్తి వివరాలను చూసేద్దామా..
డిస్ప్లే:
ఈ కొత్త Infinix Smart 10 ఫోన్‌లో 6.67-ఇంచుల HD+ డాట్-ఇన్ డిస్ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 20:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. 700 నిట్స్ పీక్స్ బ్రైట్‌నెస్ అందిస్తూ వివిధ కంటెంట్‌ను క్లియర్‌గా చూపిస్తుంది. అంతేకాకుండా, డైనమిక్ పోర్ట్ అనే ఫీచర్ ద్వారా నోటిఫికేషన్లు సజావుగా కనిపిస్తాయి.
Vivekananda Goud: ఆయన లాగా బ్యాగులు మోసి రాజకీయాల్లో పైకి రాలేదు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
ప్రాసెసర్ అండ్ స్టోరేజ్:
ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 10 మొబైల్ 1.8GHz UNISOC T7250 ఆక్టా-కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇందులో 4GB LPDDR4X ర్యామ్, అదనంగా 4GB వర్చువల్ ర్యామ్ తో కలిసి మొత్తం 8GB వరకు RAM సామర్థ్యంను అందిస్తుంది. ఇందులో 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. దీనిని microSD కార్డ్ మరింతగా విస్తరించుకోవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత XOS 15.1తో రన్ అవుతుంది. ఇందులో ప్రత్యేకంగా Ella AI అసిస్టెంట్ ఉంటుంది. ఇది భారతీయ స్థానిక భాషల్లో స్పందించగలదు. కంపెనీ ప్రకారం, ఈ ఫోన్ నాలుగేళ్ల వరకు లాగ్-ఫ్రీ పనితీరును అందించగలదు.
నెట్‌వర్క్ లేకున్నా కమ్యూనికేషన్:
ఇందులో No Network Communication Mode అనే ప్రత్యేక ఫీచర్ ఉంది. ఇది మొబైల్ నెట్‌వర్క్ అందుబాటులో లేనప్పుడు కూడా అత్యవసర కమ్యూనికేషన్ సేవలను కొనసాగించడంలో ఉపయోగపడుతుంది.
కెమెరా అండ్ ఇతర ఫీచర్లు:
ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 10 ఫోన్‌లో 8 మెగాపిక్సెల్ వెనుక కెమెరా డ్యూయల్ LED ఫ్లాష్‌తో వస్తుంది. అలాగే 8 మెగాపిక్సెల్ ముందు కెమెరా LED ఫ్లాష్‌తో సెల్ఫీలు, వీడియో కాలింగ్‌కు సహాయపడుతుంది. ఈ ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 3.5 మిమీ ఆడియో జాక్, DTS స్టీరియో స్పీకర్లు, FM రేడియో వంటి ఉపయోగకరమైన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాక ఇది ధూళి, నీటి చిమ్మకలకు నిరోధకంగా ఉండే IP64 రేటింగ్‌ను కలిగి ఉంది. దీనివల్ల సాధారణ వాతావరణ పరిస్థితుల్లో భద్రతగా ఉపయోగించవచ్చు.
Ganja Smuggling: వరంగల్‌లో రూ.25 లక్షల గంజాయి పట్టివేత.. మైనర్ సహా ఇద్దరు యువకులు అరెస్ట్
బ్యాటరీ అండ్ కనెక్టివిటీ:
ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 10లో డ్యుయల్ 4G VoLTE, Wi-Fi 2.4GHz, Bluetooth 5.2, GPS, USB Type-C వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 5000mAh బ్యాటరీ, 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది.
ధర:
ఈ ఫోన్ స్లీక్ బ్లాక్, టైటానియం సిల్వర్, ఐరిస్ బ్లూ, ట్విలైట్ గోల్డ్ రంగుల్లో లభించనుంది. ఈ మొబైల్ 4GB+64GB వేరియంట్ ధర రూ. 6,799గా ఉంది. ఫ్లిప్ కార్ట్ ద్వారా ఆగస్ట్ 2 నుంచి విక్రయానికి అందుబాటులోకి రానుంది. మొత్తంగా చెప్పాలంటే ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 10 బడ్జెట్ వినియోగదారుల కోసం గొప్ప డిసైన్, వేగవంతమైన డిస్‌ప్లే, AI ఫీచర్లు, శక్తివంతమైన బ్యాటరీతో మంచి ప్యాకేజీగా నిలుస్తుంది.